Jalandhar : ఉపఎన్నికల్లో ఆప్ విజయం-కాంగ్రెస్ 24 ఏళ్ల రికార్డు బద్దలు..

పంజాబ్ లోని జలంధర్ లోక్ సభ సీటుకు జరిగిన ఉపఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన జలంధర్ సీటును ఆప్ తొలిసారి గెల్చుకుంది. గత 24 ఏళ్లుగా జలంధర్ సీటును గెల్చుకుంటూ పట్టు కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దీంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్ కు ఇది మరో విజయం.

జలంధర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ 24 ఏళ్లుగా పట్టు కొనసాగిస్తోంది. దీన్ని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టింది. జలంధర్ ఎంపీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో ఆప్ .. 58,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. చతుర్ముఖ పోటీలో గతంలో కాంగ్రెస్ లో ఉండి ఆప్ కు మారిన అభ్యర్ధి రింకూ.. ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది.. కాంగ్రెస్ అభ్యర్ధి కరమ్ జిత్ కౌర్ ను ఓడించారు.

Jalandhar

వాస్తవానికి జలంధర్ లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సంతోఖ్ చౌదరి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ ఆకస్మికంగా మరణించారు. దీంతో జలంధర్ సీటుకు ఉపఎన్నిక వచ్చింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఆయన భార్య కరమ్ జీత్ కౌర్ ను నిలబెట్టింది. అయినా ఆప్ అభ్యర్ధి చతుర్ముఖ పోటీలో సానుభూతి పవనాల్ని సైతం తట్టుకుని విజయం సాధించారు. పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం పనితీరు వల్లనే అపూర్వ విజయం సాధించామని పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

తాము పని రాజకీయాలు చేస్తామని, తమ పనిని గుర్తించి ఓట్లు అడుగుతామని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. ఈ ఫలితం ఓ పెద్ద సందేశం అని భగవంత్ మాన్ తెలిపారు. ఎన్నికల ఫలితాలు బాధ్యతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని, పంజాబ్‌ను అభివృద్ధి చేసేందుకు మరింత కష్టపడతామని ఆయన అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఓటమిని అంగీకరించారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, దాని అభ్యర్థి సుశీల్ రింకును అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+