ఓటేయమని చెప్పి..: అమీర్ ఖాన్ అప్‌సెట్ అయ్యారు!

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈసారి తాను మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేయకపోతున్నానని చాలా అప్ సెట్‌గా ఉన్నారట. త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి ఆయన ఓటు వేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

మొదటిసారి అమీర్ ఖాన్ మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఓటు వేయకపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఓ సిటిజన్‌గా అమీర్ తన బాధ్యతలను విస్మరించిన సందర్భం లేదనే చెప్పవచ్చు.

అయితే, ఈసారి ఆయన మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేయాలంటే.. 18 గంటలకు పైగా ప్రయాణించి రావాల్సి ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఓటు వేసేందుకు అమీర్ ఖాన్ తన హాలీడేస్‌లలో కూడా పని చేశారు. అయితే, ఈసారి ఓటు వేయలేకపోతున్నానని ఆయన బాధపడుతున్నారు.

Aamir Khan ​is ​upset about not being able to vote

మహారాష్ట్రలో ఎన్నికలు జరిగే సమయానికి అమీర్ ఖాన్ అమెరికా పర్యటనలో ఉండనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే అమీర్ ఖాన్ అమెరికా పర్యటన ఫిక్స్ అయింది. అమీర్ ఖాన్ పర్యటన విషయమై ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో ఆయన తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతను చాలా బాధపడుతున్నారని అంటున్నారు. ఎన్నికల్లో ఓటు వేయాలని గతంలో అమీర్ ఖాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలాంటిది ఇప్పుడు తానే ఓటు వేయకపోతున్నందుకు చాలా బాధపడుతున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+