కట్టుబడి ఉన్నా, దేశం విడిచి వెళ్లం: అమీర్ ఖాన్
ముంబై: తనకుగానీ, తన భార్యకు గానీ దేశం విడిచి వెళ్లే ఆలోచనే లేదనిస ఇకపై ఉండబోదని బాలీవుడ్ నటుడు ఆమీ ర్‌ఖాన్ స్పష్టం చేశాడు. ‘భారత్ నా దేశం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇక్కడ పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాను' అని అన్నాడు. ‘భారత వదిలిపోదామా అని నా భార్య నన్ను అడుగుతోంది'అని తాను వ్యాఖ్యానించడంపై దేశ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో ఆమీర్ వివరణ ఇచ్చాడు.
అయితే తాను ఇంటర్వ్యూలోని ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నానని అమీర్ ఖాన్ చెప్పాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసు కున్నవారు ఆ ఇంటర్వ్యూ చూసి ఉండకపోవచ్చని, లేదా వక్రీకరిస్తూండొచ్చని అభిప్రాయపడ్డాడు. తనను దేశవ్యతిరేకిగా భావిస్తున్నవారందరికీ చెప్పదలుచుకున్నదేమిటంటే భారతీయుడిగా తాను గర్విస్తున్నానని అన్నాడు. అందుకు ఎవరి అనుమతీ అక్కర్లేదని అన్నాడు.

తన మనసులో మాట వెల్లడించినందుకు దుర్బాషలాడుతున్నవారంతా తన వాదనను నిరూపిస్తున్నారని చెప్పడానికి బాధపడుతున్నానని చెప్పాడు. తనకు మద్దతు నిలిచినవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. మనమంతా కలిసి దేశ సమగ్రతను, వైవిధ్యాన్ని, సమిష్టి తత్వాన్ని, దేశ భాషలను, సంస్కృతిని, చరిత్రను, సహనశీలతను, ప్రేమతత్వాన్ని, సున్ని తత్వాన్ని, భావ దారుఢ్యాన్ని కాపాడుకుందామని అన్నాడు.
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో.. ఎక్కడ మనుషులు తలలెత్తుకుని తిరుగుతారో.. ఎక్కడ జ్ఞానం విరివిగా వెల్లివిరుస్తుందో.. సంసారపు గోడల మధ్య ఎక్కడ శకలాల కింద ప్రపంచం విడిపో లేదో.. ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలు కులు బైలు వెడలుతాయో.. ఎక్కడ అలసట తెలియని శ్రమ తన బాహువుల్ని పరి పూర్ణతవైపు జాస్తుందో.. ఎక్కడ నిర్జీవ మైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో.. ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో.. ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు అనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవితా పంక్తులతో తన ప్రకటనను ముగించాడు.












Click it and Unblock the Notifications