కీలక పరిణామాలు- శాసన సభాపక్షం భేటీకి పిలుపు: కొత్త సీఎం ఎవరో తేలింది?

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- రాజీనామాకు పూనుకున్నారు. తన పదవిని త్యజించనున్నారు. ప్రజా తీర్పునకు కోరనున్నారు. కొత్తగా ఎన్నికలకు వెళ్లనున్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

నేడు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికోసం ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలుసుకోనున్నారు. ఈ సాయంత్రం 4:30 అపాయింట్ లభించింది. లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఆ సమయంలో ఆయన వెంట ఇద్దరు లేదా ముగ్గురు మంత్రివర్గ సహచరులు ఉంటారు.

AAP called legislative party to meet to elect new CM of Delhi at 12 noon today

ఆయన రాజీనామా చేయబోతోన్న నేపథ్యంలో- ఢిల్లీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకదాని వెంట ఒకటిగా కీలక పరిణామాలు సంభవిస్తోన్నాయి. లెప్టినెంట్ గవర్నర్‌ను కలుసుకోవడానికి ముందే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. దీనికోసం ఈ మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభాపక్షం సమావేశం కాబోతోంది.

ఈ సమావేశంలో కేజ్రీవాల్, మంత్రులు ఆతిషి, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలందరూ పాల్గొనబోతోన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అనంతరం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా, అరవింద్ కేజ్రీవాల్ వారసురాలిగా మంత్రి ఆతిషి మర్లెనా సింగ్‌కే అధిక అవకాశాలు ఉన్నాయి. ఈ రేసులో ఆమె ఫ్రంట్ రన్నర్‌గా నిలిచారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇప్పటికే ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ.. మంత్రులందరితోనూ ఒక్కొక్కరిగా సమావేశమైంది. వారి అభిప్రాయాలను సేకరించింది.

ఆమె పేరును ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుత కేబినెట్‌లో ఆతిషి.. అయిదు మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్నారు. మహిళా శిశు సంక్షేమం, విద్య, పర్యాటకం, ఆర్ట్స్, కల్చర్, లాంగ్వేజ్, పబ్లిక్ వర్క్స్, విద్యుత్ శాఖల మంత్రిగా ఉన్నారు.

కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు చురుగ్గా వ్యవహరించారు. బీజేపీ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారు. ఉన్నత విద్యావంతురాలు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక కార్యకర్తగా వ్యవహరించారు. వివాద రహిత నాయకురాలిగా ఆమెకు మంచి పేరు ఉంది. ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+