వ్యాఖ్యలు:' ఆమె మగ ఓటర్లను ఇలా , మనకు ఆ అవసరం లేదు'

గోవా రాష్ట్రంలోని శిరోదా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తోన్న మోలు విలిప్ సతీమణిపై అదే నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తోన్న మంత్రి మహదేవ్ నాయక్ అసభ్యకరంగా మాట్లాడారు.

గోవా:ఎన్నికల ప్రచారంలో బిజెపి మంత్రి మహదేవ్ నాయక్ ఆప్ అభ్యర్థి మోలు విలిప్ సతీమణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . ఈ వ్యాఖ్యలపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శిరోదా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా మోలు విలిప్ బరిలో ఉన్నాడు. ఆయన తరపున ఆయన సతీమణి ప్రచారం చేస్తున్నారు.

aap candidate's wife accuses bjp mla of spreading rumours

ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి పరిశ్రమల శాఖ మంత్రి మహదేవ్ నాయక్ పోటీచేస్తున్నాడు. అయితే మహదేవ్ నాయక్ బిజెపి అభ్యర్థిగా బరిలో ఉన్నాడు.

విలిప్ భార్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.పూనం సావంత్ అనే బిజెపి కార్యకర్తతో మంత్రి నాయక్ మాట్లాడిన వీడియో ఒకటి లీకైంది. విలిప్ భార్య ఓటర్ల కాళ్ళకు దండాలు పెడుతున్నారు. మగ ఓటర్లకు ఇతర మార్గాల్లో వల విసురుతారని, మనకు అలాంటి అవసరం లేదని ఆయన బిజెపి కార్యకర్తతో మాట్లాడిన వీడియో ఒకటి వెలుగుచూసింది.

ఈ వీడియోను విలిప్ భార్య సంపాదించింది. ఆదివారం నాడు పొండా పోలీస్ స్టేషన్ లో మంత్రి మహదేవ్ నాయక్ పై ఫిర్యాదు చేసింది.

తన భర్తను ఓడించేందుకుగాను బిజెపి నాయకులు నీచానికి పాల్పడుతున్నారని, తనపై అసభ్యంగా ప్రచారంచేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేశారు.

ఈ వీడియో ఆదారంగా పోలీసులు మంత్రి మహదేవ్ నాయక్ పై కేసు పెట్టారు. అయితే ఈ వీడియోలోని మాటలను ఆప్ నాయకులు తప్పుగా అన్వయించుకొన్నారని మంత్రి అనుచరులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+