తిన్నామా పడుకున్నామా తెల్లారిందా: గోవాలో ఇదీ ఈ పార్టీ పరిస్థితి !
గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటే అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది. గోవాలో కచ్చితంగా అధికారంలో వస్తామని ఇన్ని రోజులు డబ్బాకొట్టుకున్న ఆప్ కనీసం
పనాజి: గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటే అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పరిస్థితి మరీ దారుణంగా తయారైయ్యింది. గోవాలో కచ్చితంగా అధికారంలో వస్తామని ఇన్ని రోజులు డబ్బాకొట్టుకున్న ఆప్ కనీసం ఒక్క స్థానంలో కూడా ముందంజలో నిలబడలేకపోయింది.
గోవాలో ఆర్బాటంగా ప్రచారం చేసి ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అక్కడ ఎలా తలఎత్తుకుని తిరుగుతారో ఆ దేవుడికే తెలియాలి అంటున్నారు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు.

గోవాలోని కుంకొలిమ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఆప్ ముఖ్మమంత్రి అభ్యర్థి ఎల్విస్ గోమ్స్ సైతం వెకంజలో ఉన్నారు. ఆయన కంటే కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఎల్విస్ గోమ్స్ ఇంటి నుంచి బయటకురావడం లేదు. ఆప్ కార్యకర్తలు సైతం ఆయన ఇంటి వైపు కన్నెత్తికూడా చూడటం లేదు.
గోవాలో పోటీ చేసిన చాల నియోజక వర్గాల్లో ఆప్ కు కనీసం డిపాజిట్లు వచ్చే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజక వర్గాల్లో, బీజేపీ ఆరు నియోజక వర్గాల్లో, ఇతరులు నాలుగు నియోజక వర్గాల్లో విజయం సాధించారు. ఆప్ మాత్రం గోవాలో ఖాతా తెరవలేకపోయింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications