ఆప్ మహిళా కౌన్సిలర్‌ను జుట్టుపట్టి ఈడ్చుకొచ్చిన పోలీసులు: అరెస్ట్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ నిషా సింగ్‌ను ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పోలీసులు జుట్టు పట్టి బయటకు ఈడ్చుకొచ్చి, కొట్టి మరీ అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గూగుల్ సంస్థలో పని చేసిన ఆమె, ఆప్ విధానాలకు ఆకర్షితురాలై ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు.
శుక్రవారం నాడు హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం ముందు జరిగిన హింసాత్మక ఘటనతో సంబంధముందని ఆరోపిస్తూ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆమెను అరెస్ట్ చేసేముందు పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆప్ కార్యకర్తలు ఆరోపించారు.

శుక్రవారం నాటి ఘర్షణల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలున్నా వారిని చూసీ చూడనట్లుగా వదిలేశారని, తనకు తగిలిన గాయాలకు నిషా సింగ్ చికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారని, అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది ఇలా ఉండగా, ఈ అల్లర్ల కేసులో నిషాతోపాటు మరో 9మంది మహిళలపై హత్యాయత్నం కేసులను నమోదు చేశారు పోలీసులు. అరెస్ట్ అనంతరం నిషాను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, రిమాండ్ విధించడంతో ఆమెను భోండ్సీ జైలుకు తరలించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications