మోడీని టార్గెట్ చేశారు!: 67-3 క్రికెట్ స్కోర్‌కాదు, టీలో కేసీఆర్ ఢిల్లీలో కేజ్రీ..

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల అనంతరం.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ద్వారా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు దీనిపై స్పందించారు. ఇన్నాళ్లు మోడీ హవా కారణంగా.. బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు అడపాదడపా విమర్శలు గుప్పిస్తున్నాయి. తప్పితే వారికి అసలైన అవకాశం రాలేదు. ఇప్పుడు కేజ్రీ దెబ్బతో బీజేపీని, ముఖ్యంగా మోడీని టార్గెట్ చేసేందుకు విపక్షాలకు అవకాశం దొరికింది.

ఈ రోజు అహంకారం, రాజకీయ ప్రతీకారం ఓడిపోయాయి. బీజేపీ బెలూన్ పగిలిపోయింది - మమతా బెనర్జీ

బీజేపీ ఓటమి ప్రధాని మోడీ ఓటమి. దేశమంతా మోడీ గాలి వీస్తోందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ గాలి కంటే ఢిల్లీలోని సునామీ శక్తిమంతమని అక్కడి ప్రజలు నిరూపించారు. - ఉద్ధవ్ థాకరే

లవ్ జిహాద్, ఘర్ వాపసీ వంటి వాటి వల్లే హస్తినలో బీజేపీ ఘోరంగా ఓడింది. - అఖిలేష్ యాదవ్

ఫలితాలు మోడీ పనితీరుకు కొలమానం. దేశంలోని అన్ని ప్రాంతాల వారు నివసించే ఢిల్లీలో బీజేపీ ఓటమి.. దేశ మనోగతానికి ప్రతిబింబం. నెక్స్ట్ బీహార్. - నితీష్ కుమార్.

AAP ki sarkar: KEJRIWAL RULES DELHI

ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి పోవాలి ప్రజలు కోరుకుంటున్నారు. ఫలితాలు దానికి నిదర్శనం - బీజేపీ మిత్రపక్షం పీఎంకే అధినేత రాందాస్

ఏఏపీది చారిత్రాత్మక విజయం - రాందేవ్ బాబా

ఏఏపి గెలుపు కాదు.. బీజేపీ వ్యతిరేకవాదుల గెలుపు - ఆరెస్సెస్ నేత ఎంజీ వైద్య

బీజేపీ, మోడీలు అజేయులు కారని తేలింది - ఒమర్ అబ్దుల్లా

ప్రజలే గొప్పవాళ్లని తేలింది. అయితే కాశ్మీర్‌లో బీజేపీతో కలిసి మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యత్నానికి దీనికి సంబంధం లేదు - పీడీపీ నేత నయీమ్ అక్తర్.

ఇంటర్నెట్లో ఏఏపీ హవా

నెటిజన్లు.. ఏఏపీకి గ్రీటింగ్స్‌.. కాంగ్రెస్‌, బీజేపీలకు చురకలు వేశారు. అలాంటి ట్వీట్లలో కొన్ని..

- '67-3.. చూడబోతే ఇదేదో క్రికెట్‌ స్కోరులా ఉంది'

- రాహుల్‌ రాజీనామా చేయాల్సిందే అని ఎందుకు అడుగుతారు? అసలు ఎవరైనా తమ రాజకీయ జీవితంలో ఎన్నిసార్లు రాజీనామా చేయగలరు? రాహుల్ రాజీనామా లేఖలు రాయడం మొదలుపెడితే
కాంగ్రెస్‌ పార్టీ తన మస్కట్‌గా ఆర్యభట్టను పెట్టుకోవాలి. ఎందుకంటే సున్నాను కనిపెట్టింది ఆయనే!

- మోడీ: కేజ్రీవాల్‌ నా దగ్గర మూడు సీట్లున్నాయి ఏం చేయమంటావు?
కేజ్రీ: ఓఎల్‌ఎక్స్‌లో పెట్టు!!

- బీజేపీకి వచ్చిన సీట్ల కన్నా టయోటా ఇన్నోవాలో ఎక్కువ సీట్లు ఉంటాయి.

- ఢిల్లీలో ప్రతిపక్ష సభ్యులంతా కలసి ఎంచక్కా నానో కారులో వెళ్లొచ్చు

- పది లక్షల రూపాయల కోటును పది రూపాయల చీపురు ఉతికి ఆరేసిన వైనం చరిత్రలో నిలిచిపోతుంది

- దేశమంతా మోడీ గాలి వీచినా కొత్త రాష్ట్రంలో కేసీఆర్, కొత్త ఢిల్లీలో కేజ్రీవాల్. రెండుచోట్ల కారణం అధికార కిరణాలు.
కిరణ్ కుమార్, కిరణ్ బేడీ.

- పికె బ్లాక్ బస్టర్, ఎకె మాస్ మాస్టర్

- కాంగ్రెస్‌పై అసహ్యం వేయడానికి పదేళ్లు పట్టింది. పది నెలల్లోపే బీజేపీకి ఆ పరిస్థితి

- స్వచ్ఛ భారత్ ఇప్పుడే మొదలైంది. స్వేచ్ఛా భారత్ ఢిల్లీ నుంచి

- 67 ఏళ్ల తరువాత ముచ్చటైన ఎన్నిక 67-3. దేశమంతా మోడీ
వేవ్ ఉంది. పక్కలో బల్లెం కూడా ఉంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+