లైంగిక దాడి: మరో ఆప్ శాసన సభ్యుడు అరెస్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్నఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. ఢిల్లీ పోలీసులు తాజాగా మరో ఆప్ శాసన సభ్యుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఒఖ్లా నియోజక వర్గం శాసన సభ్యుడు అమానతుల్లా ఖాన్ ను అరెస్టు చేశామని బుధవారం పోలీసులు చెప్పారు. అమానతుల్లా ఖాన్ మరదలు తన మీద లైంగిక దాడి చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాకేత్ కోర్టులో ఆమె వాంగ్మూలం కూడా ఇచ్చారు. కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన తరువాత పోలీసులు శాసన సభ్యుడు అమానతుల్లా ఖాన్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న అమానతుల్లా ఖాన్ తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు.
తన బావ తన మీద లైంగిక దాడి చేశాడని, శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేరే మహిళతో రాసలీలలు సాగిస్తున్న ఆప్ మంత్రి సందీప్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వెంటనే మరో శాసన సభ్యుడి మీద లైంగిక దాడి ఆరోపణలు రావడంతో అరవింద్ కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications