Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ: మంత్రి తోమర్ అరెస్ట్, ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందన్న డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ: తప్పుడు ధృవపత్రాలను సమర్పించిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో సోమవారం రాత్రే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తాజా ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని బార్‌ కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది.

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ అరెస్టైన విషయాన్ని ఆప్‌కు చెందిన సీనియర్ నేత సంజయ్ సింగ్ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ న్యాయశాఖ మంత్రిని కనీసం నోటీసులైనా ఇవ్వకుండా ఒక నేరస్తుడిలా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులు, మోడీ ప్రభుత్వం అసలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన సమయంలో, విద్యార్హతలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.

48 ఏళ్ల తోమర్ మొదటి సారి మంత్రి పదవిని చేపట్టారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తోమర్ విద్యార్హతలపై ఆరోపణలు వచ్చాయి.

AAP minister Jitendra Singh Tomar arrested in Delhi

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ అరెస్టైన విషయాన్ని ఆప్‌కు చెందిన సీనియర్ నేత సంజయ్ సింగ్ ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. 48 ఏళ్ల తోమర్ మొదటి సారి మంత్రి పదవిని చేపట్టారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తోమర్ విద్యార్హతలపై ఆరోపణలు వచ్చాయి.

తోమర్ తప్పుడు పత్రాలను సమర్పించారని విచారణలో తేల్చిన పోలీసులు మంగళవారం ఉదయం ఎలాంటి ముందుస్తు సమాచారం ఇవ్వకుండా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

బీహార్‌లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బి డిగ్రీ పొందారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, జితేంద్ర సింగ్ తోమర్ ఎన్నికను సవాలుచేస్తూ బీజేపీ నేత నందర్ కిషోర్ గర్గ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తప్పుడు డిగ్రీ సర్ట్ఫికెట్‌తో న్యాయవాదిగా ఎన్‌రోల్ చేయించుకున్నట్లు వచ్చిన అభియోగాలపై ఢిల్లీ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. నామినేషన్ ఫారంతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో తోమర్ నకిలీ విద్యార్హతలను పేర్కొన్నారని గర్గ్ పిటిషన్‌లో ఆరోపించారు. నకిలీ విద్యార్హతలను అఫిడవిట్‌లో పేర్కొన్నందున తోమర్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

తోమర్ లా డిగ్రీని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఫిబ్రవరిలోనే దాఖలైన మరో పిటిషన్‌పై న్యాయస్థానం ఆదేశాన్నిచ్చింది. నకిలీ డిగ్రీ ఆధారంగా తోమర్ బీహార్‌లోని బిశ్వంత్‌సింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగ ల్ స్టడీ కాలేజ్‌లో అడ్మిషన్‌పొందారని ఈ పిటిషన్ ఆరోపించింది.

ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా ఉన్న జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నకిలీవని బీహార్ విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. బీహార్‌లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ విశ్వవిద్యాలయంలో తాను చదివినట్లు మంత్రి తోమర్ సర్టిఫికెట్ చూపించగా, అది నకిలీదని పేర్కొంటూ విశ్వవిద్యాలయం తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది.

దీంతో తోమర్ విద్యార్హతలేంటని, రికార్డులో ఆయన పేర్కొన్న లా సర్టిఫికెట్ నకిలీదని పేర్కొంటూ ఈ విషయంపై ఆగస్టు 20 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తమ విశ్వవిద్యాలయ రికార్డుల్లో తోమర్ పేరు లేదని, ఈ సీరియల్ నెంబర్‌తో వేరే వ్యక్తి పేరు నమోదై ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తేల్చి చెప్పారు.

ఢిల్లీలో ఎమర్జెన్సీ: మనీష్‌ సిసోడియా

ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తోమర్‌ అరెస్టుపై డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా త్రీవంగా స్పందించారు. ఢిల్లీలో ఎమర్జెన్సీలాంటి పరిస్థితి నెలకొందని అన్నారు. మంత్రి తోమర్‌ ఉగ్రవాదా? బాంబు పెట్టరా? అని ప్రశ్నించారు. అవినీతిపై పోరాడుతున్నందుకే మంత్రి తోమర్‌ను అరెస్టు చేశారని సిసోడియా తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+