ఆప్ మహిళా ఎమ్మెల్యేకి కన్నుగొట్టిన తుంటరి: చెంప చెళ్లు మనిపించింది(ఫోటో)
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆల్కా లాంబాతో ఓ ఆకతాయి అసభ్యకరంగా ప్రవర్తించడంతో చెంప చెళ్లుమనిపించింది. ప్రముఖ కవి మిరాజ్ గాలిబ్ నివశించిన భవానాన్ని పరిశీలించేందుకు వచ్చిన సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున చౌందినీ చౌక్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆల్కా లాంబా ప్రముఖ కవి మిరాజ్ గాలిబ్ నివశించిన వారసత్వం భవనాన్ని పరిశీలించేదుకు వచ్చిన సమయంలో రాజేష్ అనే 20 ఏళ్ల యువకుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
इस मनचले को भी नहीं पता चला की मैं कौन हूँ, पहले मुस्कुराया,फिर आँख मारी,फिर कंधा,फिर मेरा कस कर एक चांटा,अब जेल.. pic.twitter.com/8vfJchOPM2
— Alka Lamba (@LambaAlka) April 23, 2015 ఆమెను తదేకంగా చూస్తూ కన్ను కొట్టాడు. దగ్గరగా వచ్చి తాకేందుకు కూడా యత్నించాడు. ఇది గ్రహించిన ఆల్కా లాంబా అతడి చెంప చెళ్లుమనిపించారు. ఇంతలో అతడు పారిపోతుండగా, అక్కడే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు రాజేష్ బల్జీత్ నగర్ ఏరియాలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

జరిగిన ఉదంతాన్ని తానే స్వయంగా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఫోటోలతో సహా పోస్ట్ చేశారు. రాజేష్‌కు మతిస్ధిమితం సరిగ్గా లేదని బంధువులు చెబుతుండగా, అందుకు తగ్గ ఆధారాలు చూపలేదని ఆల్కా లాంబా ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేగా సేవలందిస్తోన్న ఆల్కా లాంబా, ఢిల్లీ టూరిజం పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications