Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేజ్రీవాల్ కొత్త లెక్కలు - సమరానికి సై..!!

కేంద్రం జమిలి ఎన్నికల దిశగా కసరత్తు వేగవంతం చేసింది. రేపు పార్లమెంట్ లో జమిలి బిల్లు ప్రతిపాదన పైన ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఎన్నికల్లో జరిగే రాష్ట్రాల్లో గెలుపు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. మరో రెండు నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారం నిలబెట్టుకోవటం కేజ్రీవాల్ సమర్థతకు పరీక్షగా మారుతోంది. దీంతో, ముందస్తుగానే ఆప్ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఎన్నికల వరాలు ప్రకటిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ లో సమరానికి సిద్దం అంటోంది.

తుది జాబితాలో
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మూడు జాబితాలు ప్రకటించిన ఆప్.. చివరి విడత అభ్యర్ధులను ప్రకటించింది. నాలుగో జాబితాలో భాగంగా 38 మంది అభ్యర్ధులను పార్టీ వెల్లడించింది. అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కస్తూర్బా నగర్ నుంచి రమేష్ పహల్వాన్, ఉత్తమ్‌నగర్ నుంచి పూజా బలియాన్ పోటీలో ఉన్నారు. ఈ 38 మందితో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థుల ఖరారు పూర్తయింది.

AAP released the fourth and final list of candidates for the Delhi assembly elections

అభ్యర్ధుల ఖరారు
ఢిల్లీలో అభ్యర్ధుల ప్రకటన పూర్తి చేసినట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. పూర్తి ధీమా, పూర్తి సన్నాహకా లతో ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ పార్టీలకు సీఎం అభ్యర్థి లేరు, టీమ్ లేదు, ప్లానింగ్ లేదు, ఢిల్లీపై ఎలాంటి విజన్ లేదంటూ పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేసారు. వాళ్లకు కేజ్రీవాల్‌ను తొలిగించాలనే ఒకే నినాదం, ఒకే విధానం, ఒకే మిషన్ ఉంది.. అంటూ ఎద్దేవా చేసారు. ఢిల్లీ అసెంబ్లీకి 2025 ఫిబ్రవరి లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటి కే అభ్యర్ధుల ప్రకటన పూర్తి కావటంతో ఇక డోర్ టూ డోర్ ప్రచారం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆప్ నిర్ణయించింది. అదే విధంగా ఎన్నికల హామీలను ఇప్పటికే ప్రకటించింది.

మహిళలకు హామీలు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని తిరిగి గెలిపిస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.2,100 ఇస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ మొత్తాన్ని నేరుగా మహిళ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ప్రతి మహిళకు రూ.1,000 ఇస్తామని గతంలో హామీ ఇచ్చామని, అయితే కొంతమంది మహిళలు తన వద్దకు వచ్చి ద్రవ్యోల్బణం కారణంగా ఈ మొత్తం సరిపోదని చెబుతున్నారని తెలిపారు. వారి అభ్యర్థన మేరకు పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు రెండింతల కంటే ఎక్కువ పెంచినట్లు తెలిపారు. ఆటోవాలా కోసం వరాలు ప్రకటించారు. దీంతో, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+