కేజ్రీవాల్‌కు షాక్: చీలిక దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ?
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగలనుందా? పంజాబ్‌లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పార్టీ చీలిక తప్పదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఏపీకి ఇది దెబ్బే. అవినీతి ఆరోపణలపై పంజాబ్ పార్టీ చీఫ్ సుచాసింగ్ చోటేపూర్‌ను కేజ్రీవాల్ పార్టీ నుంచి తొలగించారు. దీంతో సుచాసింగ్ ఢిల్లీ సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ సిక్కు వ్యతిరేకి అని ఆరోపించారు.
మరోవైపు సుచాసింగ్‌ను తొలగించడంపై పంజాబ్‌లోని ఏఏపీకి చెందిన 12 మంది జోనల్ ముఖ్యనేతలు కేజ్రీవాల్‌కు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే సుచాసింగ్‌ను తిరిగి తీసుకోవాలన్నారు. అంతేకాక ముఖ్యనేతలైన సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్‌లను ఏఏపీ పంజాబ్ వ్యవహారాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

దీంతో పార్టీలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. అలాగే సుచాసింగ్‌ను తప్పించాలని కోరుతూ పంపిన పిటిషన్‌పై సంతకం చేసిన ఇరవై ఒక్క మంది రాష్ట్ర నేతల పైనా చర్యలు తీసుకోవాలని జోనల్ ప్రముఖులు డిమాండ్ చేశారు. దీంతో రాష్ట్ర ఏఏపీలో వేడు రాజుకుంది.
కాగా, గతంలో మంత్రిగా పని చేసిన సుచాసింగ్ చోటేపూర్ పైన శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో అనర్హత వేటు వేశారు. పంజాబ్ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం సీటును ఇప్పిస్తానని చెప్పి పార్టీకి చెందిన ఓ నేత నుంచి లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తమ వద్ద ఉందని పార్టీ అధిష్టానం చెబుతోంది. దీంతో అతనిపై వేటు వేశారు. ఏఏపీలో రాజకీయం వేడెక్కింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications