మమతా బెనర్జీ జోష్: టర్నింగ్ పాయింట్ అంటూ వ్యాఖ్య
కోల్‌కతా: ఢిల్లీలో ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు పశ్చిమబెంగాలో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. ఢిల్లీ ఫలితాలు దేశ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్ అని అన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు ప్రజలు గట్టి సమాధానం చెప్పారని మమతాబెనర్జీ తెలిపారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు అహంకారానికి పెద్ద అపజయమని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజా విజయమని ఆమె అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతన్నవారికి, ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నవారికి ఈ ఎన్నికలు ఘోర పరాజయాన్ని మిగిలించాయని ఆమె వ్యాఖ్యానించారు.
గొప్ప విజయాన్ని అందుకున్న ఢిల్లీ ప్రజలకు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకూ నాయకులకూ తన అభినందనలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు. వారికి తన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు అన్నారు. తాము చెప్పలేనంత ఆనందంతో ఉన్నామని చెప్పారు.

ప్రస్తుత రాజకీయాలకు ఢిల్లీ ఎన్నికలు కీలకమైన మలుపు అని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వేధింపులకు చోటు లేదని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలియజేశాయని మమతా అన్నారు. దేశానికి ఈ మార్పు అవసరమని దీదీ అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కేజ్రీవాల్‌ను అభినందించారు.
కాంగ్రెసు అహంకారం వల్ బిజెపి హింకు నేను చోటా ఆద్మీని సంపన్నులు, నిరుపేదలు బతికే విధంగా నీతికి, నిజాయితీకి దక్కిన విజయం ఢిల్లీలో మనం చేయాల్సింది ఎంతో ఉంది
ప్రజలకు, అహర్నిశలూ శ్రమించిన పార్టీ కార్యకర్తలకు బిజెపి పతనానికి ఢిల్లీ ప్రజలు నాంది పలికారు .భారత్ మాతాకీ జై అంటూ నినదించిన కేజ్రీవాల్.












Click it and Unblock the Notifications