ఆరుషి - హేమరాజ్ హత్య: తల్లిదండ్రులకు జీవిత ఖైదు
లక్నో: సంచలనం సృష్టించిన ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో ఆరుషి తల్లిదండ్రులకు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం జీవిత ఖైదు విధించింది. తమకు కోర్టు విధించిన శిక్ష పైన పైకోర్టుకు వెళ్తామని ఆరుషి తల్లిదండ్రులు చెప్పారు. ఈ కేసు చాలా అరుదైనదని, నిందితులకు మరణ శిక్ష విధించాలని సిబిఐ తరఫు న్యాయవాది అంతకుముందు వాదించారు.
ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తూ న్యాయస్థానం సోమవారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు రాజేష్ తల్వార్, నుపుర్ తల్వార్‌లు నేరస్తుల అని సిబిఐ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. పోలీసులు వారిని దస్నా జైలుకు తరలించారు. ఆధారాలు మాయం చేసి కోర్టును తప్పుదారి పట్టించినట్లుగా వారిపై సిబిఐ అభియోగాలు మోపింది.

నిన్న కోర్టు తీర్పు వెలువడగానే రాజేష్, నుపుర్‌లు కోర్టు హాలులోనే బోరున విలపించారు. వారికి సెక్షన్ 302 కింద కోర్టు రేపు శిక్షను ఖరారు చేశారు. ఈ హత్య కేసులో ఐదున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడింది.
కాగా, తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని, తీవ్ర నిరాశ చెందామని, ఓటమిని అంగీకరించమన్నారు, న్యాయం కోసం పోరాడుతామని, అలహాబాద్ హైకోర్టుకు వెళ్తామని రాజేష్ తల్వార్ చెప్పారు.

2008 మే 16న ఆరుషి - హేమరాజ్‌ల హత్య జరిగింది. ఈ ఘటనపై సిబిఐ కోర్టులో పదిహేను నెలలుగా విచారణ కొనసాగుతోంది. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్‌లో వారిని హత్య చేశారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దర్యాఫ్తు సమయంలో కేసు అనేక మలుపులు తిరిగింది. ఇప్పుడు కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి శిక్ష విధించింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications