మహిళపై రేప్: ఆశికీ సింగర్ అంకిత్ తివారీ అరెస్టు

24 ఏళ్ల ఆ గాయకుడు, సంగీత దర్శకుడు అంకిత్‌తో పాటు ఆయన సోదరుడు అంకర్ కూడా అరెస్టయ్యాడు. మహిళను బెదిరిస్తున్నారనే ఆరోపణపై ఈ అరెస్టులు జరిగాయి. ముంబైలోని వెర్సోవా పోలీసు స్టేషన్‌లో ఆ మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఆ మహిళ అంకిత్ గర్ల్ ఫ్రెండ్ అని మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. వారు సహజీవనం సాగిస్తున్నట్లు కూడా సమాచారం. పెళ్లి చేసుకుంటానని అంకిత్ ఆ మహిళకు హామీ ఇచ్చి, తర్వాత వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
ఆ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. అంకిత్ తివారీకి సంబంధించిన వ్యవహారంపై జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications