SSLV-D1: రాకెట్ ప్రయోగంలో సందిగ్ధం - అందని సిగ్నల్స్: విశ్లేషిస్తున్న సైంటిస్టులు..!!
ఎస్‌ఎస్‌ఎల్‌వీ -డీ1 ప్రయోగంలో సందిగ్దం ఏర్పడింది. ఇస్రో నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను నింగిలోకి ఎక్కుపెట్టింది. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి దీనిని ప్రయోగించారు. 9.18 నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీనిద్వారా తక్కువ ఎత్తులో సమీప భూకక్ష్యలోకి ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను లాంచ్ చేసారు. కానీ, అవి కక్ష్యలోకి చేరే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. లాంఛ్ అయిన రెండు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లు గుర్తించారు.
ఆ తరువాత లాంఛ్ చేసిన ఆజాదీ శాట్ గురిచి కంట్రోల్ రూం కు సిగ్నల్స్ అందటం లేదు. దీంతో..సమాచారం అందటం లేదని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్న శాస్త్రవేత్తలు..డేటా కోసం ప్రయత్నిస్తున్నారు. సిగ్నల్స్ అందటం లేదని వెల్లడించారు. ఈవోఎస్-02 ఉపగ్రహం బరువు 140 కిలోలు. ఇది భూమిని పరిశీలిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలో సాయపడుతుంది. ఆజాదీశాట్ బరువు 8 కిలోలు. 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు దీన్ని రూపొందించారు.

75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌కు గుర్తుగా దీన్ని రూపొందించారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం 9.18 గంటలకు రెండు ఉపగ్రహాలను రాకెట్ కక్ష్య లోకి వదిలింది. ఆ తరువాత కొద్ది సేపటికే సిగ్నల్స్ అందలేదు. కంట్రోల్ రూం తో అనుసంధానం లేకుండా పోయింది. తొలి రెండు దశలను సక్సెస్ గా పూర్తి చేసుకున్న తరువాత ఆజాదీ శాట్ పక్కకు తప్పినట్లుగా గుర్తించారు. రెండు శాటిలైట్లు విజయంతం అయ్యాయని భావిస్తున్నారు. కానీ, అధికారికంగా వెల్లడించలేదు.
దీంతో..ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగంగా.. డేటా ను పరిశోధిస్తున్నారు. కక్ష్యలోకి ప్రవేశించాయా లేదా..ప్రయోగించిన ఉపగ్రహాలు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయనే దాని పైన అధ్యయనం చేస్తున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications