అమీర్‌ఖాన్! ఇదంతా అప్పుడేది: సింగర్ ఓపెన్ లెటర్

ముంబై: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రముఖ గాయకుడు అభిజిత్ భట్టాచార్య.. అమీర్ ఖాన్‌కు బహిరంగ లేఖ రాశారు. అందులో అమీర్ పైన మండిపడ్డారు. ఆయన భార్య కిరణ్ రావు తీరును తప్పుబట్టారు.

అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యల పైన బాలీవుడ్ ప్రముఖులు రెండుగా విడిపోయారు. ఎక్కువ మంది అమీర్ ఖాన్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

ప్రియమైన అమీర్ ఖాన్... నేను సాధారణ భారతీయుడిని అంటూ ఆయన ఓపెన్ లెటర్ రాశారు. 'మీరు సూపర్ స్టార్. మీ సినిమాలు ఎక్కువగా చూసేది హిందూ అభిమానులు. చాలా ఏళ్లుగా మీ సినిమాలు చూసేందుకు నేను ఎంతో డబ్బు ఖర్చు చేశాను. ఇప్పుడు మీరు ఇలా ఉండేందుకు మేము (అభిమానులం) కారణం.

Abhijeet writes open letter to Aamir

పలు సినిమాల్లో మీ పాత్రలు చూసి మేం చప్పట్లు కొట్టాం. ఆనందించాం. తారే జమీన్ పర్ సినిమాను చూసి హృదయం ద్రవించింది. మీ కంటే ముందు బాలీవుడ్‌కు ఎందరో వచ్చారు. కానీ, మీరు లేదా ఇతర హీరోలు కానీ తమను గురించి దాచుకొని, ఈ స్థాయికి ఎదగలేదు.

మీరు కొత్త భారత్‌లో స్టార్లు. మిమ్మల్ని బాగా అభిమానించాం. కానీ నిన్నటి మీ వ్యాఖ్యలు బాధించాయి. మీరు ఉన్న నగరం కొందరి వల్ల (కో రిలీజియనిస్ట్స్) దగ్ధమైతే అప్పుడు అసహనం గురించి ఎందుకు మాట్లాడలేదు. ఓ టెర్రరిస్టును ఉరి తీసినప్పుడు.. అతనికి మద్దతుగా అంతిమయాత్రకు చాలామంది హాజరయ్యారు.

అప్పుడు ఎందుకు అభద్రతగా భావించలేదు. ఆడ పోలీసుల పైన చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మౌనంగా ఉన్నారేం. కానీ హఠాత్తుగా ఇప్పుడు మీ భార్య కిరణ్ రావుకు అభద్రతగా అనిపించింది.' అని పేర్కొన్నారు. ఇక్కడ అసహనం ఉందంటున్నారు. వేరే దేశాల్లో సురక్షితంగా ఉంటారా అని నిలదీశారు. అమీర్ ఖాన్ మమ్మల్ని నిరుత్సాహపరిచారని చివరలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+