పరీక్ష తర్వాత నిరసనలో పాల్గొనండి: NEET విద్యార్థులకు దిప్కే పిలుపు
దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు రెండో రోజు కొనసాగుతున్నాయి. దిల్లీ పోలీసులు ఒక్కరోజు మాత్రమే నిరసనలకు అనుమతి ఇచ్చారు. కానీ అనుమతి గడువు ముగిసినప్పటికీ అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీలకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. ఇక ఇటీవల దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాల్లో ఆందోళనలు చేపట్టిన సీజేపీ.. ఆ తర్వాత దిల్లీలోని జంతర్ మంతర్ కు చేరుకుంది.
నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. తాము ఇక్కడే కూర్చొంటామని.. జంతర్ మంతర్ వద్ద కాకపోతే మరో చోట నిరసన తెలుపుతామని.. నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కు అని దీప్కే పేర్కొన్నారు. అలాగే నిరసనకారులు పట్టుకున్న ప్ల కార్డులు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీకు చెందిన మెలోడీ మీమ్స్ తో ప్లకార్డులు అక్కడ దర్శనమిస్తున్నాయి.. అలాగే పేపర్ లీక్ ఎప్పుడు ఆగిపోతుంది..? అనే ప్లకార్డులు కనిపిస్తున్నాయి. అంతేకాక నటి గోపీ బాహు.. లాప్ టాప్ ను వాష్ చేస్తున్న మీమ్ తో ప్లకార్డులు ఉన్నాయి.
అలాగే ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ తాము ఇక్కడినుంచి వెళ్లేది లేదని మరోసారి సీజేపీ స్పష్టం చేసింది. ఓ చేతిలో థాలీ పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక నీట్ రాస్తున్న విద్యార్థులు పరీక్ష పూర్తికాగానే నిరసనలో పాల్గొనాలని దిప్కే పిలుపునిచ్చారు. మరోవైపు ఆందోళనల్లో ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తాము నిరాహార దీక్ష చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఈరోజు నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలు సూచనలు చేశారు. పరీక్ష నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి భయం, ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఎవరూ ఆటలు ఆడకూడదని అన్నారు. ఇక దేశంలోని 551 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాల్లో పరీక్ష నీట్ పరీక్షను నిర్వహించనున్నారు అధికారులు. ఈ పరీక్షకు దాదాపు 22.79 లక్షలకుపైగా మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications