విదేశీ శక్తుల ప్రలోభానికి లోనవుతున్నది ఎవరు..? దిప్కే కీలక ట్వీట్ వైరల్..

ప్రధాని మోదీ ఇటీవల దసరా సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ గౌరవానికి భంగం కలిగించే శక్తులు.. సమాజాన్ని విభజించే వ్యక్తులు.. మన దేశ సంస్కృతిని ద్వేషించే మనస్తత్వం కలిగినవారే దేశ శత్రువులని అన్నారు. అలాంటి శత్రువులను ఎదుర్కోవడానికి దేశ ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ప్రతిపక్షాలు ప్రధాని మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. కేంద్రం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి.. అలాగే ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడానికి విదేశీ శక్తులు లేదా దేశద్రోహం అనే ప్రచారాన్ని వాడుకుంటోందని విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే.. ప్రధాని మోదీపై ఎక్స్ వేదికగా కీలక పోస్టు పెట్టారు.

"భారత్ లో అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను సున్నా స్థాయికి తగ్గించేందుకు అంగీకారం తెలిపింది ప్రధాని మోదీనే.. అలాగే అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది ప్రధాని మోదీనే.. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక మేరకు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపి వేసేందుకు అంగీకరించింది ప్రధాని మోదీనే.. కానీ విచిత్రం ఏంటి..? అంటే వారి దృష్టిలో విదేశీ శక్తుల చేతిలో కీలు బొమ్మలుగా మారింది మాత్రం ప్రతిపక్షాలు, సీజేపీ మాత్రమే" అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దిప్కే ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

AbhijitDipke CJP founder posts a significant tweet about PM Modi Abhijit Dipke latest twitter news

అటు ఆర్‌ ఎస్‌ ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఇటీవల చేసిన కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని మార్చితే దేశంలో పరిస్థితులు మారిపోతాయనుకోవడం సరికాదని.. భారత్‌ ను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే శక్తుల ఆటలు సాగబోవని వ్యాఖ్యానించారు. భారత్‌ పురోగతిని అడ్డుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని భగవత్‌ కీలక ఆరోపణలు చేశారు. అలాగే నిరసనకారులు, శాంతిభద్రతలను పర్యవేక్షించే అధికారులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే సమాజంలో ద్వేషం, కక్షలు, విభజనలకు కారణం కాకూడదని అన్నారు. ఈ క్రమంలోనే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఈ కీలక ట్వీట్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+