అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవు, వెన్నెముకకు గాయమైంది: డాక్టర్లు

న్యూఢిల్లీ: ఎయిర్ మార్షల్ అభినందన్‌కు ఆదివారం నాడు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతని శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని వైద్యులు తెలిపారు. మూకల దాడిలో అభినందన్ పక్కటెముకలు కొద్దిగా దెబ్బతిన్నాయని తెలిపారు. అభినందన్ వెన్నెముకకు కూడా కొద్దిగా గాయమైందని తెలిపారు.

అభినందన్‌కు ఢిల్లీ కంటోన్మెంట్‌లో మరో పది రోజుల పాటు చెకప్, ట్రీట్మెంట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అతని శరీరంలో ఏమైనా బగ్స్ పెట్టారా అనేది కీలకం. అయితే పాకిస్తాన్ ఏ బగ్స్ పెట్టలేదని వైద్యులు గుర్తించారు.

Abhinandan suffered injuries on spine, rib after ejecting from MiG: Medical reports

ఆ ఫోటోలు బయటపెట్టవచ్చు: దిగ్విజయ్

ఇదిలా ఉండగా, బాలాకోట్‌ ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడికి సంబంధించి ఆధారాలు, ఫొటోలు బయటపెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఆపరేషన్‌పై తనకేమి అనుమానాలు లేవన్నారు. ప్రస్తుతం పరిజ్ఞానం ప్రకారం శాటిలైట్‌ ఫొటోలు బయటపెట్టడం అంతకష్టమేని కాదన్నారు.

వాయుసేన అధికారి అభినందన్‌ను విడిచిపెట్టడంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు దిగ్విజయ్‌సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 2011లో ముంబై దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని భారత వాయుసేన కోరగా.. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పుకోలేదన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రధాని మోడీని మించిన అబద్ధాల కోరును చూడలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+