Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నా రియల్ హీరో: అభినందన్ మీసం స్టైల్ ఫాలో అయిన మహమ్మద్ చాంద్, పిల్లలకూ పేర్లు

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ మీసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందరూ సాధారణంగా హీరోల క్రాఫ్‌ను, మీసాలను ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అభినందన్ మీసం కట్టు వైరల్‌గా అవుతోంది. రియల్ హీరో అయిన అభినందన్‌ను చాలామంది ఫాలో అవుతున్నారు. దీంతో ఆయన మీసం స్టయిల్‌కు పాపులారిటీ పెరిగింది.

బెంగళూరుకు చెందిన మహమ్మద్‌ చాంద్‌ అనే యువకుడు అభినందన్‌ మీసం స్టైల్‌ను ఫాలో అయ్యాడు. అభినందన్‌లా మీసం కట్టు చేయించుకున్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై మహమ్మద్ మాట్లాడుతూ... తాను అభినందన్‌ సర్‌కు వీరాభిమానిని అని, ఇలాంటి విషయాల్లో ఆయనను ఫాలో అవుతుంటానని, ఆయన స్టైల్‌ చాలా బాగుంటుందని, అభినందన్‌ సర్‌ రియల్‌ హీరో అని ప్రశసించాడు.

ఇదివరకు సల్మాన్ ఖాన్ అభిమానిని.. ఇప్పుడు నా హీరో అభినందన్

ఇదివరకు సల్మాన్ ఖాన్ అభిమానిని.. ఇప్పుడు నా హీరో అభినందన్

ఆయనలాగే మీసకట్టు చేయించుకొన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, గతంలో తాను హీరో సల్మాన్‌ ఖాన్‌ అభిమానిని అని, ఇప్పుడు తన ఫేవరెట్‌ హీరో అభినందన్ అని మహమ్మద్ చాంద్ తెలిపాడు. ఇటీవల పాకిస్తాన్ సైన్యం అభినందన్‌ను అదుపులోకి తీసుకొని, జెనీవా ఒప్పందం ప్రకారం రెండు రోజుల్లో తిరిగి అప్పగించిన విషయం తెలిసిందే.

అభినందన్ మీసాలకు ఫిదా

అభినందన్ మీసాలకు ఫిదా

abhinandan moustache style అనే హ్యాష్‌ ట్యాగ్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభినందన్‌ మీసం స్టయిల్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. తమకూ ఇలాంటి స్టయిల్ మీసం కట్టు కావాలని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. భారత్‌లోని పలుచోట్ల సెలూన్లలో అభినందన్‌ హెయిర్‌ కట్‌కు, మీసం కట్టుకు డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారట.

బాబుకు అభినందన్ పేరు

అంతేకాదు, కొత్తగా పుట్టిన కొందరు పిల్లలకు అభినందన్ పేరు పెట్టుకుంటున్నారు. ఈ మేరకు స్వాతి రాని అనే యువతి ట్వీట్ చేసింది. తన సోదరుడికి కొడుకు పుట్టాడని, అతనికి అభినందన్ అని పేరు పెట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+