అమానుషం :బట్టలిప్పేసి, చెప్పులదండలు వేశారు,ఎందుకంటే?
అభిషేక్ అనే యువకుడిని బట్టలిప్పి చెప్పులు మెడలో వేసి స్థానికులు దాడి చేశారు. అమ్మాయిలను వేధిస్తున్నారనే ఆరోపణలతో ఆయనపై దాడి చేశారు.అయితే దళితుడైనందునే అభిషేక్ పై దాడి .
బెంగుళూరు :యువతులను వేధిస్తున్న పోకిరిని స్థానికులు శిక్షించారు. అయితే దళితుడైనందునే యువకుడిపై దాడులు చేశారని బాదిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని గుబ్బిపోలీస్ స్టేషన్ పరిధిలో 20 ఏళ్ళ అబిషేక్ ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. దీంతో ఆగ్రహనికి లోనైన యువతి బంధవులు ఆమెతోనే పోన్ చేయించి తోటకు రప్పించి బట్టలు ఊడలు దీశారు.మెడలో చెప్పులు వేసి దాడి చేశారు.

యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ,అలాంటి వారికి ఇదే గతి అంటూ పలకలో రాసి మెడలో వేశారు. ఈ ఫోటోను వాట్సాప్ ద్వారా పంపారు. అయితే ఈ విషయమై అభిషేక్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు సంఘటనస్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. అభిషేక్ పై దాడి చేసినవారు పారిపోయారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications