మమత మేనల్లుడికి కలకత్తా హైకోర్టు షాక్..!

పశ్చిమబెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత టీఎంసీ నేతలకు ఏదీ కలిసి రావడం లేదు. ఓవైపు కేసులతో సీఎం సువేందు అధికారి తురుముతుంటే, మరోవైపు జనం కూడా టీఎంసీ నేతలపై దాడులకు దిగుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేల సంతకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee)కి ఇవాళ షాక్ తగిలింది. తనపై నమోదైన కేసులపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ బెనర్జీకి చుక్కెదురైంది.

వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు వీలుగా ఒక కేసులో అత్యవసర విచారణ జరపాలని ఎంపీ అభిషేక్ బెనర్జీ చేసిన అభ్యర్థనను కలకత్తా హైకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. అనేక కేసులు, ఎఫ్‌ఐఆర్‌లను ఎదుర్కొంటున్న అభిషేక్.. కంటి చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉందని పేర్కొంటూ ఈ కేసును త్వరగా విచారించాలని కోరారు. అయితే ఈ కేసు సాధారణ ప్రక్రియలో భాగంగానే విచారణకు వస్తుందని, అత్యవసర విచారణకు అనుమతించలేమని హైకోర్టు జడ్డి సౌగత భట్టాచార్య తేల్చిచెప్పేశారు.

Abhishek Banerjee Gets No Relief Calcutta High Court Rejects Urgent Hearing Plea

రాష్ట్ర అసెంబ్లీ సంతకాల మోసం కేసులో, ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అభిషేక్ బెనర్జీని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఐడీ ప్రశ్నించింది. నియామకాల కుంభకోణంలో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రశ్నించిందని అభిషేక్ కోర్టుకు తెలిపారు. సమన్లు, విచారణ జరుగుతున్నప్పటికీ, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ విదేశాలకు వెళ్లడానికి మాత్రం ఎలాంటి అడ్డంకి లేదు. అయితే 2016 అక్టోబర్‌ల ముర్షిదాబాద్‌లో జరిగిన ఒక పార్టీ కార్యక్రమం నుండి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా అభిషేక్ గాయపడ్డారు. ఆయన కళ్ల కింద తీవ్రంగా గాయపడటంతో సర్జరీ చేయించుకోవలసి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉన్నందున కేసుల అత్యవసర విచారణ కోరగా హైకోర్టు నిరాకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+