రెబెల్ ఎంపీలకు టీఎంసీ షాక్..! స్పీకర్ కు 20 అనర్హత పిటిషన్లు..!
పశ్చిమ బెంగాల్లో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కు (TMC) వరుస ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. అసలే ఓడిపోయిన బాధలో ఉన్న మమతా బెనర్జీ పార్టీలో తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. ముందు ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎంపీలు తిరుగుబాట్లు చేశారు. అయితే ఎంపీల తిరుగుబాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మమతా బెనర్జీ కీలక పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆమె మేనల్లుడు, టీఎంసీ లోక్ సభాపక్ష నేత అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) స్పీకర్ ఓం బిర్లాను కలిశారు.
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శ, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇవాళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమ పార్టీతో విభేదిస్తూ ఎన్సీపీఐలో విలీనానికి సిద్దమైన 20 మంది రెబెల్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇప్పటికే రెబెల్ ఎంపీల వాదన విన్న స్పీకర్.. ఇవాళ అభిషేక్ బెనర్జీ అభిప్రాయం కూడా తీసుకున్నారు. అనంతరం వీరి అనర్హత వేటుకు ఆమోద ముద్ర వేయడమా లేక విలీనానికా అన్నది తేల్చబోతున్నారు. అయితే మూడొంతుల మంది సభ్యులు ఫిరాయిస్తే వేరే వర్గంగా గుర్తించవచ్చన్న వాదనతో రెబెల్స్ ఎన్సీపీఐలో విలీనానికి సిద్దమవుతున్న వేళ.. అభిషేక్ బెనర్జీ స్పీకర్ ను కలిశాక మీడియాతో మాట్లాడారు.

19 June 2026 | Shri @abhishekaitc addresses the media in Delhi. pic.twitter.com/jv7IX9JQzG
— All India Trinamool Congress (@AITCofficial) June 19, 2026
టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు 3-4 రోజుల క్రితం స్పీకర్‌ను కలిసి, తాము ఒక ప్రత్యేక సమూహంగా ఏర్పడినట్లు పేర్కొన్నారని, మీడియా కథనాల ప్రకారం, తమను ఒక ప్రత్యేక సమూహంగా పరిగణించాలని వారు కోరారని ఆయన తెలిపారు. ఆ తర్వాత కొద్ది గంటలకే, వారిలో 2-4 మంది తాము NCPIలో విలీనమయ్యామని ప్రకటించారన్నారు. అసలు ఆ పార్టీ గురించి తమకు ఎవరికీ తెలియదన్నారు. టీఎంసీ తరపున లోక్‌సభలో పార్టీ నాయకుడిగా, తాను వారిపై 20 వేర్వేరు అనర్హత పిటిషన్లను సమర్పించానన్నారు. ప్రత్యేక సమూహంగా ఏర్పడ్డామని చెప్పుకుంటున్న వీరికి వ్యతిరేకంగా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనలు ఉన్నాయని,వారికి కనీస నిజాయితీ ఉన్నా, వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.














Click it and Unblock the Notifications