ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి జీరో-ఇండియా కూటమి క్లీన్ స్వీప్..! ఏబీపీ సంచలన సర్వే రిపోర్ట్..!

లోక్ సభ ఎన్నికల వేళ దక్షిణాది రాష్ట్రాల్లో ఓటరు నాడి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు జాతీయ మీడియా నెట్ వర్క్ ఏబీపీ.. సీ ఓటర్ తో కలిసి నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వే ఫలితాలను తాజాగా ఏబీపీ విడుదల చేసింది. ఇందులో రెండు దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ ఖాతా తెరవడం కష్టమని తేల్చేసింది. అదే సమయంలో ఆయా రాష్ట్రాలను ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని తేల్చింది.

ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం తమిళనాడులో ఉన్న 39 లోక్ సభ సీట్లను ఇండియా కూటమి ఏకపక్షంగా కైవసం చేసుకోబోతోందని తేల్చి చెప్పేసింది. ఇందులో అధికార పార్టీలైన డీఎంకే 31, కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుని వైట్ వాష్ చేస్తాయని తెలిపింది. డీఎంకే అయితే ఏకంగా 54.7 శాతం ఓట్లు సాధిస్తుందని వెల్లడించింది. అలాగే కేరళలోనూ ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు తెలిపింది. కేరళలోని 20 లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ 16, లెఫ్ట్ కూటమి 4 సీట్లు గెల్చుకోబోతున్నట్లు సర్వే తెలిపింది.

ABP CVoter Opinion Poll predicts zero seats to bjp in these two southern states india bloc sweeps

మరోవైపు తమిళనాడు, కేరళ రెండు చోట్లా బీజేపీ ఖాతా తెరవడం కష్టమని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చిచెప్పేసింది. దీంతో ఈసారి తమిళనాడులో నిర్మలా సీతారామన్, జైశంకర్ వంటి కేంద్రమంత్రుల్ని బరిలో నిలిపేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు షాక్ తగిలినట్లయింది. అలాగే కేరళలోనూ ఖాతా తెరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవచ్చని ఏబీపీ సర్వే రిపోర్ట్ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+