అబూసలేంకు చుక్కెదురు: పెళ్లికి పెరోల్ తిరస్కరించిన బాంబే హైకోర్టు
ముంబై: గ్యాంగ్‌స్టర్ అబూసలేంకు చుక్కెదురైంది. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోవడానికి పెరోల్ కోసం అబూసలేం చేసిన అభ్యర్థనను బాంబే హైకోర్టు తిరస్కరించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వీకే తాహిల్‌రమణి, జస్టిస్ ఎంఎస్ సోనక్‌తో కూడిన ధర్మాసనం అతడి తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
జైళ్ల చట్టాల ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల కింద అరెస్టై, శిక్ష అనుభవిస్తోన్న వ్యక్తికి పెరోల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కాగా, అబూసలేం కొన్ని సంవత్సరాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని ఓ మహిళకు ప్రమాణం చేశాడని సలేం తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

అంతేగాక, శిక్ష అనుభవించేవారికి కూడా కుటుంబ జీవితాన్ని గడిపే హక్కు, సామాజిక సంబంధాలు నెరిపే హక్కు ఉంటుందని తన వాదనలు వినిపించారు. గతంలో వివిధ కేసుల్లో సుప్రీం ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ, బాంబే కోర్టు మాత్రం పెరోల్ ఇవ్వడానికి అంగీకరించలేదు.
2005లో పోర్చుగల్ అబూసలేంను భారత్‌కు అప్పగించింది. అప్పటి నుంచి అతడు జైల్లోనే ఉంటున్నాడు. 2002లో ఓ వ్యాపార వేత్త నుంచి రూ.5కోట్లు డిమాండ్ చేసిన కేసుకు సంబంధించి ఢిల్లీలోని స్థానిక న్యాయస్థానం గత నెల అబూసలేంకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలడంతో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. 1993 పేలుళ్లలో 257మంది ప్రాణాలు కోల్పోగా, 713మంది గాయాలపాలయ్యారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications