షాక్: సంక్రాంతికి శశికళ దిమ్మ తిరిగింది: పార్టీలో తిరుగుబాటు !
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా శశికళ సీఎం కావాల ? వద్దా అంటూ జూనియర్ వికటన్ జనరల్ సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించింది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా,
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని కలలు కంటున్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి నెచ్చెలి శశికళ నటరాజన్ కు సంక్రాంతి పండగ సందర్బంగా ఆ రాష్ట్ర ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ దెబ్బతో అన్నాడీఎంకేలోని ఆమె అనుచరులు కంగుతిన్నారు.
ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలను సంప్రధించకుండా అన్నాడీఎంకేలోని సీనియర్ నాయకులు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చిన్నమ్మ శశికళకు అప్పగించి చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే.
చిక్కుల్లో అమ్మ క్యాంటీన్లు: రూ. 120 కోట్లు నష్టం, పట్టించుకోని ?
జయలలిత స్థానంలో శశికళను తాము ఊహించుకోలేమని, అమ్మను శశికళలో తాము చూసుకోలేమని తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

జయలలిత నిజమైన వారసురాలు ఆమె మేనకోడలు దీపా జయకుమార్ అంటు బహిరంగంగా చెబుతున్నారు. ఈ సందర్బంలో జూనియర్ వికటన్ జనరల్ సర్వే నిర్వహించింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి ప్రజలు, కార్యకర్తలను నుంచి అభిప్రాయాలు సేకరించింది.
అన్నాడీఎంకేకి చేతకాదు: తమిళనాడులో ఆందోళనకు దిగిన డీఎంకే
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా తాము శశికళను అంగీకరించమని తేల్చి చెప్పారు. శశికళకు వ్యతిరేకంగా 75.13% మంది అన్నాడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.
సంక్రాంతి పండగ సందర్బంగా ఈ సర్వే ఫలితాలు శుక్రవారం ఉదయం తమిళ మీడియాలో బయటకు వచ్చాయి. విషయం తెలుసుకున్నశశికళ వర్గంలోని మంత్రులు, పార్టీ నాయకులు షాక్ కు గురైనారు. సామాన్య కార్యకర్తల్లో ఇలా వ్యతిరేకత ఉంటే వచ్చే ఎన్నికల్లో మనకు డిపాజిట్లు గల్లంతు అవుతాయని నాయకులు ఆందోళనకు గురైనారు. మొత్తం మీద చిన్నమ్మకు సంక్రాంతి పండగ సందర్బంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద షాక్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications