Marriage Expenses: ఇండియాలో పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు అవుతున్నారు.. !
భారతీయులు చదువు పై పెట్టే ఖర్చు కంటే పెళ్లిళ్ల కోసం పెట్టే ఖర్చు ఎక్కువగా ఉందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ఒక నివేదికలో తెలిపింది. భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు రూ.10 లక్షల కోట్లు ($130 బిలియన్లు) ఉంటుందని అంచనా వేసింది. ఇది ఆహారం, నిత్యావసరాల తర్వాత రెండవ స్థానంలో ఉందని పేర్కొంది. సగటు భారతీయుడు విద్య కంటే వివాహ వేడుకలకు రెండుసార్లు ఖర్చు చేస్తున్నాడని ఒక నివేదిక పేర్కొంది.
యేటా చైనాలో 70-80 లక్షలు వివాహాలు, యూఎస్ లో 20-25 లక్షల వివాహాలు జరుగుతుండగా.. భారతదేశంలో ఏటా 80 లక్షల నుంచి 1 కోటి వివాహాలను జరుగుతన్నాయని తెలిపింది "భారత వివాహ పరిశ్రమ యుఎస్‌లోని పరిశ్రమ పరిమాణం కంటే దాదాపు రెండింతలు ($70 బిలియన్లు), అయినప్పటికీ చైనా కంటే చిన్నది ($170 బిలియన్లు)" అని బ్రోకరేజ్ జెఫరీస్ ఒక నివేదికలో తెలిపారు. భారతదేశంలో వివాహాల కోసం భారీగా ఖర్చు పెడతారు. పెళ్లి ఖర్చులు, వస్త్రాల కొనుగోలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

పరోక్షంగా వాహన, ఎలక్ట్రానిక్స్‌కు పరోక్షంగా ప్రయోజనం పొందుతాయని పేర్కొంది. "ఏటా 8 మిలియన్ల నుండి 10 మిలియన్ల వివాహాలు జరుగుతాయి, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వివాహ గమ్యస్థానంగా ఉంది" అని జెఫెరీస్ వివరించింది. భారతీయ వివాహాలు రెండు, మూడు రోజులు జరుగుతాయి. ఇండియాలో పెళ్లి కోసం సగటున రూ.12.50 ఖర్చు పెడతారని వివరించింది. "పెళ్లి పరిశ్రమ ఆటోమొబైల్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, పెయింట్స్ మొదలైన వివిధ రంగాలకు పరోక్షంగా లబ్దీ పొందుతాయి. ఈ పరిశ్రమలకు వివాహ సీజన్‌లో డిమాండ్ పెరుగుతాయి. వివాహ ప్రణాళిక సాధారణంగా 6-12 నెలల ముందుగానే ప్రారంభమవుతుంది" అని జెఫరీస్ నివేదిక తెలిపింది.
అంతర్జాతీయ స్థాయి ఖరీదైన ప్రదేశాలు, అతిథులకు మర్యాదలు, పసందైన వంటకాలతో భారత వివాహాలు ఆడంబరంగా జరుగుతాయని జెఫరీస్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో దుస్తులు, ఆభరణాలు, ఆతిథ్యం, క్యాటరింగ్, రవాణా వంటి రంగాల కార్యకలాపాలు పుంజుకుంటాయని వివరించింది. దేశంలో ఏటా నమోదయ్యే మొత్తం ఆభరణాల విక్రయాల్లో సగం పెళ్లిళ్ల కోసమే జరుగుతాయని వివరించింది. చాలా మంది తాహతకు మించి పెళ్లిలు చేసి అప్పులపాలు అవుతున్నారు.












Click it and Unblock the Notifications