శ్రీదేవి జాతకం ప్రకారం 70 ఏళ్లు, మృత్యువు వెంటాడలేదు, చావును పిలిచారు, జ్యోతిష్కుడు!
Recommended Video

బెంగళూరు: దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్ ప్రముఖ నటి శ్రీదేవి మరణించిన విషయం తెలిసిందే. అయితే శ్రీదేవి జాతకం ప్రకారం ఆమెకు 70 ఏళ్లు ఆయుషు ఉందని, అయితే చావును కొని తెచ్చుకున్నారని కర్ణాటకలోని ఉడిపికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అంటున్నారు. శ్రీదేవి జాతకం క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఒన్ ఇండియాకు పూర్తి సమాచారం ఇచ్చారు.

శ్రీదేవి జాతకం
శ్రీదేవి మరణించారని విషయం తెలియగానే సోషల్ మీడియాలో ఆమె జాతకం తీసుకున్నామని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అన్నారు. 1963 ఆగస్టు 13వ తేదీ ఉదయం 5.30 గంటల సమయంలో పాతమద్రాసు (ప్రస్తుతం చెన్నై నగరం)లొ శ్రీదేవి జన్మించారు.

నక్షత్రం, రాశ
శ్రీదేవి కృతికా నక్షత్రం, మూడవ పాదం, వృషభ రాశిలో జన్మించారని, ఆమె లగ్నం కర్కాటకం అని, ప్రస్తుతం శని మహార్దశలో ఉన్నారని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అంటున్నారు. గత ఏడాది జూన్ నుంచి శని వృషభ రాశిలోకి ప్రవేశించాడని, శ్రీదేవికి అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య చెప్పారు.

శ్రీదేవికి 70 ఏళ్లు ఆయుషు
శ్రీదేవి జాతకం ప్రకారం ఆమె ఆయుషు 70 ఏళ్లు. అయితే శ్రీదేవి 70 ఏళ్ల వరకూ ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం లేదని, ఆమె అనారోగ్యంతో మంచంపట్టి ఇతరుల సహాయంతో సేవలు చేయించుకుని బతికే అకాశం ఉండేదని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య వివరించారు.

మృత్యువు ముందే హెచ్చరిస్తుంది
శ్రీదేవి జాతకం ప్రకారం మృత్యువు ముందే ఆమెను హెచ్చరిస్తుంది. అందుకు జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య కొన్ని ఉదాహరణలు వివరించారు. వెంట్రుకలు రాలిపోవడం, పదేపదే మనసుకు భయం కలగడం, నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో ఎత్తుకుపోతున్నారని కలలు వస్తాయని, మృత్యువు ఇలా ముందే హెచ్చరిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య వివరించారు.

చావురాలేదు, తెచ్చుకున్నారు
శ్రీదేవికి కచ్చితంగా మృత్యువు వెంటాడలేదని, అయితే ఆమె చావును కొని తెచ్చుకున్నారని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అన్నారు. అయితే ఈజాతకం ఉన్న వాళ్లు తాము చనిపోయే ముందు అత్యంత సన్నిహితుల దగ్గర తన చావు గురించి ప్రస్తావించే అకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అన్నారు.

మనుషులు బల్ప్ తో సమానం
మనుష్యులు బల్ప్ తో సమానం అని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అన్నారు. బల్ప్ తయారు చేసిన వారు అది ఎంతకాలం ఉంటుందో నిర్ణయిస్తారు. అయితే బల్ప్ కు ఏర్పాటు చేసే విద్యుత్ వైర్లు, విద్యుత్ ఓల్టేజ్ మీద దాని ఫిల్ మిట్ ఆయుషు ఆధారపడి ఉంటుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య వివరించారు.

పాపం, పుణ్యం
బల్ప్ ఫిలమిట్ లాగే మనుషలు జీవనశైలి ఉంటుందని, పాపం, పుణ్యం, స్వయం అపరాధాలు, ఆరోగ్యంపైన మన అయుషు ఆధారపడి ఉంటుందని, వస్తువులకు వారంటీ ఉన్నట్లు జ్యోతిష్యుడు నీవు ఇంతకాలం బతుకుతావు అని మాత్రమే చెబుతారని, వస్తువును కాపాడుకున్నట్లే మనల్ని మనం కాపాడుకుంటే ఆయుషు ఉన్నంత కాలం ప్రాణాలతో ఉంటామని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య వివరించారు.
-
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications