బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్ బుక్ లో ప్రియురాలి నగ్న ఫోటోలు, ఫోన్ నెంబర్, వ్యభిచారి, మీరు ఫోన్ చెయ్యండి, చివరికి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తనతో శారీరక సంబంధం కొనసాగించలేదని పగ పెంచుకున్న యువకుడు తన ప్రియురాలి నగ్న చిత్రాలు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి ఈమె వ్యభిచారి (వేశ్య), ఎవ్వరైనా సంప్రధించవచ్చు, మంచి సుఖం ఇస్తుంది అంటూ ఆమె ఫోన్ నెంబర్ పోస్టు చేసిన కామాంధుడిని బెంగళూరులో ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

వరకట్నం తీసుకురాలేదని భార్య మర్మాంగం మీద ఐరన్ బాక్స్ తో కాల్చిన కిరాతకుడు!వరకట్నం తీసుకురాలేదని భార్య మర్మాంగం మీద ఐరన్ బాక్స్ తో కాల్చిన కిరాతకుడు!

బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో బీబీఎం రెండో సంవత్సరం చదువుతున్న శోవిక్ భువన్ (21) అనే యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని ముంబై తీసుకెళ్లారు. అసోంకు చెందిన యువతి బెంగళూరులో నివాసం ఉండేది. ఆ సమయంలో అసోం యువతి భువన్ కు పరిచయం అయ్యింది

ఏకాంతంగా ఉన్న ప్రియురాలు !

ఏకాంతంగా ఉన్న ప్రియురాలు !

భువన్, యువతి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరు ఏకాంతంగా చాల సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు తీసుకున్నాడు. యువతితో శారీరక సంబంధం పెట్టుకున్న భువన్ ఆమె నగ్న ఫోటోలు తీసుకున్నాడు. తరువాత ఉద్యోగ రీత్యా యువతి ముంబై వెళ్లిపోయింది.

 బెంగళూరుకు రావాలి

బెంగళూరుకు రావాలి

ప్రియురాలు దూరం అయ్యిందని భువన్ కోపం పెంచుకున్నాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, నువ్వు బెంగళూరు రావాలని భువన్ యువతికి ఫోన్ చేసి వేధించాడు. అందుకు యువతి నిరాకరించడంతో భువన్ తన మాజీ ప్రియురాలి మీద పగ పెంచుకున్నాడు.

ఫేస్ బుక్ లో 20 నగ్న ఫోటోలు

ఫేస్ బుక్ లో 20 నగ్న ఫోటోలు

ఫేస్ బుక్ లో యువతి నగ్నంగా ఉన్న 20 ఫోటోలు పోస్టు చేసి ఈమె వ్యభిచారి, మంచి సుఖం ఇస్తుంది ఎవరైనా సంప్రధించడండి అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఆమె మొబైల్ నెంబర్ ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో రచ్చరచ్చ అయ్యింది.

యువతి ఫ్రెండ్స్ చూశారు

యువతి ఫ్రెండ్స్ చూశారు

యువతికి ఆమె స్నేహితులు సమాచారం ఇచ్చారు. యువతి ఫిర్యాదు చెయ్యడంతో ముంబై పోలీసులు బెంగళూరు వచ్చారు. తాను బెంగళూరు వచ్చానని, ఇక్కడికి వచ్చి కలవాలని యువతితో పోలీసులు ఫోన్ చేయించారు. యువతి చెప్పిన ప్రాంతానికి భువన్ వెళ్లిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

ఎంత మంది జీవితాలతో !

ఎంత మంది జీవితాలతో !

పెళ్లి కావాల్సిన అమ్మాయి నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన కామాంధుడిని పోలీసులు బెండ్ తీశారు. యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యుల పరువు రోడ్డుకు ఈడ్చిన భువన్ ఇంకా ఎంత మంది యువతుల జీవితాలతో ఇలా చెలగాటం ఆడాడు అంటూ ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Accused student arrested in Bengaluru uploading women private photos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X