delhi violence: ఐబీ అధికారి హత్య కేసులో తాహిర్ హుస్సేన్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లలో ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్ శర్మను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత, కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో అతడు పరారీలో ఉన్నాడు.
కాగా, తాను కోర్టులో లొంగిపోతానంటూ తాహిర్ హుస్సేన్ అభ్యర్థించినప్పటికీ కోర్టు తిరస్కరించింది. తాహిర్ హుస్సేన్‌ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.
ముందస్తు బెయిల్ కావాలంటూ మంగళవారం తాహిర్ హుస్సేన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో గురువారం తాహిర్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం తాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అంకిత్ శర్మ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తాహిర్ హుస్సేన్‌పై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) సెక్షన్ 365(అపహరణ), 302(హత్య) నేరం కింద తాహిర్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లు జరిగిన సమయంలో తాహిర్ హుస్సేన్.. తన నివాసం వద్దే ఉన్నారని, అక్కడే చాలా మంది గుమిగూడి ఉన్నారని పోలీసులు తెలిపారు.
అయితే, ఫిబ్రవరి 26న అంకిత్ శర్మ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి బయటికి తీసిన తర్వాత నుంచి తాహిర్ హుస్సేన్ అందుబాటులో లేడని పోలీసులు తెలిపారు. ఆయన ఇంట్లో వెతికినప్పటికీ దొరకలేదని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసలు చెప్పారు.
కాగా, తాహిర్ హుస్సేన్‌కు చెందిన భవనంలోకి చేరిన ఆందోళనకారులు అక్కడ్నుంచి సమీపంలోని ఇళ్లపై పెట్రోల్ బాంబులు విసిరినట్లు పలు వీడియోలు కూడా బయటికి రావడం గమనార్హం.
కాగా, తాహిర్ హుస్సేన్.. అల్లర్లు జరుగుతున్న సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో టచ్ లో ఉన్నాడని ఓ బీజేపీ నేత ఆరోపించారు. ఈశాన్యఢిల్లీలో అల్లర్లను ప్రోత్సహించారనే ఆరోపణలు రావడంతో తాహిర్ హుస్సేన్ ను అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విచారణలో నిర్ధోషిగా తేలితేనే తిరిగిపార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
విచారణలో భాగంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. తాహిర్ హుస్సేన్ భవనంలో అల్లర్లలో ఉపయోగించిన ఇటుకలు, పెట్రోల్ బాంబులు, కర్రలు లభ్యమయ్యాయి. అయితే, తాను అమాయకుడినని, అల్లర్లతోనూ, ఆ హత్యతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని తాహిర్ హుస్సేన్ తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications