వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్య కేసు: గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో తాగాడు, వెళ్లమని తల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా టెక్కీ అనూహ్య హత్యకు ముందు నిందితుడు తాగి ఉన్నట్లుగా అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు. అనూహ్య హత్య కేసులో చంద్రభాన్ సనప్‌ను అరెస్టు చేసిన పోలీసులు, ఛార్జీషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అనూహ్య హత్యకు ముందు రోజు రాత్రి తాము తాగామని అతని స్నేహితులు పోలీసులకు చెప్పారు.

నిందితుడు చంద్రభాన్‌కు చెందిన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ముందు రోజు రాత్రి తాము మద్యం తాగినట్లు ఓ స్నేహితుడు చెప్పాడు. ఇదే విషయాన్ని గర్ల్ ఫ్రెండ్ కూడా చెప్పారని తెలుస్తోంది. వారు మద్యం తాగిన ప్రాంతం అనూహ్య మృతదేహం దొరికిన ప్రాంతానికి దాదాపు అర కిలోమీటర్ దూరంలో ఉంది.

అనూహ్య హత్య కేసులో పోలీసులు 78 మంది సాక్ష్యులను విచారించారు. అందులో సనప్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నారు. వారు ఆ రోజు అర్ధరాత్రి వరకు మద్యం తాగారట. ఆ తర్వాత తన ద్విచక్ర వాహనం పైన అక్కడి నుండి వెళ్లిపోయాడని చెప్పారు. మద్యం తాగినట్లు సనప్ గర్ల్ ఫ్రెండ్, మరో ఫ్రెండ్ చెప్పారు.

Accused in techie’s killing was drunk, his friend tells cops

వీరి వాంగ్మూలం కేసులో కీలకమని పోలీసులు బావిస్తున్నారు. కాగా, జనవరి 5వ తేదీన రక్తం మరకలతో సనప్ ఇంటికి వచ్చాడట. సనప్ కుటుంబ సభ్యుల సాక్ష్యం మేరకు... అతను రక్తపు మరకలతో వచ్చాడు. ఏం జరిగిందని అడిగితే.. రాబరీకి పాల్పడపోయి యువతిని చంపినట్లుగా అతను చెప్పాడట. దీంతో కుటుంబ సభ్యులు అతని పైన ఆగ్రహం వ్యక్తం చేశారట. నగరం విడిచి వెళ్లిపోమని చెప్పారట.

కాగా, అనూహ్య కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు జాయింట్ కమిషనర్ సదానంద్ ధాతే సోమవారం తెలిపారు. ఈ కేసులో 546 పేజీల చార్జీషీటును దాఖలు చేసినట్లు చెప్పారు. 78 మందిని విచారించారు. నిందితుడు ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

కేసు దర్యాఫ్తుకు అవసరమైన ఎన్నో ఆధారాలను పోలీసులు సేకరించారు. అనూహ్య నుండి దొంగిలించిన బ్యాంగ్, దుస్తులు, ఐడి కార్డుతదితర వస్తువుల్లో లభించిన డిఎన్ఏను గుర్తించేందుకు ప్రయత్నించారు. నిందితుడి డిఎన్ఏతో సరిపోలింది. మరోవైపు ల్యాప్ టాప్ ఆచూకీ లభించలేదు.

English summary

 The girlfriend and another friend of Chandrabhan Sanap, accused of murdering software engineer Anuhya Esther on January 5, have told the police that the night before the crime, the accused and the duo had a liquor party at the girlfriend's hut about half a kilometre away from the spot in Kajurmarg where Esther's body was found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X