'అచ్చే దిన్' మాది కాదు... సారీ మాదే!: కేంద్రమంత్రి
ఇండోర్: అచ్చేదిన్ (మంచిరోజులు) తమ పార్టీ బిజెపి నినాదం కాదని, సోషల్ మీడియా సృష్టి అని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఝలక్ ఇచ్చారు. ఆయన మధ్యప్రదేశ్‌లో సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులు వస్తాయి) అనే నినాదాన్ని బిజెపి ఎప్పుడు చెప్పలేదన్నారు. ఈ మధ్య ఎక్కడకు వెళ్లినా మంచి రోజులు మాటేమిటని ప్రశ్నిస్తున్నారని, నిజానికి అది తమ పార్టీ నినాదం కాదన్నారు. అది సోషల్ మీడియా సృష్టి అని చెప్పారు.

ఎవరు ఆపాదించినప్పటికీ ఆ నినాదంతో తమ పార్టీ ఇమేజ్ పెరిగిందని, దానికి కమిట్ అవ్వాల్సిందేనని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికి ఆయన తన పొరపాటును సరిదిద్దుకున్నారు.
తన వ్యాఖ్యల్లో కొన్నింటిని మాత్రమే కత్తిరించి చూపడం వల్ల భావంలో తప్పులు దొర్లాయని, అచ్చే దిన్ మా నినాదమేనని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ జనరంజక పాలనలో ఇప్పటికే ఆ రోజులు వచ్చాయన్నారు.
ఉల్లిగడ్డ ధరల పెరుగుదల పైన మాట్లాడుతూ... దీని పైన ఇప్పటికే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.












Click it and Unblock the Notifications