లా విద్యార్థిపై యాసిడ్ దాడి, మరోచోట ఫ్యామిలీపై యువతి 'సెక్స్ రాకెట్' ఆరోపణ

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లో ఓ విద్యార్థిని పైన ఇద్దరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ యాసిడ్ దాడికి పాల్పడ్డారు. బాధిత విద్యార్థిని న్యాయవిద్యను అభ్యసిస్తోంది.

ఆ దాడిలో ఆమెకు గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు ఈ సంఘటన శ్రీనగర్‌లోని న్యాయ విశ్వవిద్యాలయం బయట చోటు చేసుకుంది. టీవీ రిపోర్ట్స్ ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి, యాసిడ్ దాడి చేసి, అక్కడి నుండి పారిపోయారు. ఈ దాడిని నిరసిస్తూ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

బాధిత బాలిక వయస్సు 21. ఆమె ప్రయివేటు న్యాయ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. దీని పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడి చేశారని పోలీసులు చెప్పారు. వెంటనే గాయపడ్డ బాలికను ఎస్కేఐఎంఎస్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారని వారు తెలిపారు. తాము విచారణ జరుపుతున్నామన్నారు.

Acid attack on law student in Srinagar

కాగా, శ్రీనగర్‌లో ఇది రెండో యాసిడ్ అటాక్. గత ఏడాది జనవరి నెలలో ఓ ప్రయివేటు పాఠశాల ఉపాధ్యాయురాలి పైన ఇలాంటి యాసిడ్ దాడి జరిగింది. అప్పుడు ఈ దాడి భగత్ బర్జుల్లా ప్రాంతంలో చోటు చేసుకుంది.

పశ్చిమ బెంగాల్‌లో దారుణం..

పశ్చిమ బెంగాల్లో దారుణం వెలుగు చూసింది. తనను తన అత్తింటి వారు సెక్స్ రాకెట్లోకి దించే ప్రయత్నం చేశారని, దానిని తాను తిరస్కరించడంతో తనను ఆదరించడం లేది ఓ ముప్పై ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఫిర్యాదు చేసిన బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు ముగ్గురు కూడా అబ్బాయిలు. వ్యభిచార వృత్తి కోసం తాను ఆడపిల్లలను కనలేదని తన అత్తింటి వారు అసంతృప్తికి లోనయ్యారని ఆమె ఫిర్యాదు చేసింది. కాగా, కోల్‌కత్తాలోని సోనగంచి ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ప్రాంతం అని తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+