యాక్షన్ కింగ్ ఇంట్లో పెళ్లి, ఐశ్వర్యకు వరుడు సెట్ అయ్యాడు, హీరో ఎవరో తెలుసా !
బెంగళూరు/చెన్నై: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అలియాస్ అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. తమిళ హాస్యనటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతి, ప్రేమబరహ సినిమా ఫేమ్ ఐశ్వర్య అర్జున్ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవల వీరి పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ విషయాన్ని తంబి రామయ్య స్వయంగా ధృవీకరించారు. వీలైనంత త్వరగా పెళ్లి జరిపిస్తామని తంబి రామయ్య అన్నారు.
ప్రముఖ నటుడు శక్తి ప్రసాద్ తనయుడు అర్జున్ సర్జా చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. మొదట్లో కొన్ని కన్నడ సినిమాల్లో నటించిన అర్జున్ ఆ తర్వాత కోలీవుడ్‌లో సక్సెస్‌ని అందుకున్నాడు. తర్వాత చెన్నైలో అర్జున్ స్థిరపడ్డారు. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు వివిద బాషల్లో నటించిన అర్జున్ యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. తరువాత యాక్షన్ కింగ్ అర్జున్ నటి నివేదితను ప్రేమ వివాహం చేసుకున్నాడు, అర్జున్ కు ఐశ్వర్యతో పాటు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కూతురు ఐశ్వర్య కూడా ఆమె తండ్రి అర్జున్ బాటలోనే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఐశ్వర్య తొలిసారిగా పదేళ్ల క్రితం పట్టతుయానే అనే తమిళ చిత్రంలో నటించింది. 5 సంవత్సరాల క్రితం అర్జున్ సర్జా నిర్మించి, దర్శకత్వం వహించిన ప్రేమ బరహ అనే కన్నడ సినిమాలో ఐశ్వర్య కథానాయికగా నటించింది. సినిమాలో ఐశ్వర్యకు జోడిగా చందన్ నటించాడు.
ఈ చిత్రంలోని ఒక పాటలో అర్జున్, ధృవ సర్జా, చిరు సర్జాతో పాటు ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ స్టెప్పులేశారు. అదే సినిమా తమిళంలో కూడా డబ్ అయింది. ఆ తర్వాత ఐశ్వర్య ఏ సినిమాలోనూ నటించలేదు. మనకు సినిమాలు సెట్ కావు అనుకున్న ఐశ్వర్య తరువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. రెండుమూడు సినిమాల్లో అవకాశం వచ్చినా నటించడానికి ఐశ్వర్య నిరాకరించారని తెలిసింది. ఇప్పుడు ఆమె పెళ్లి ఫిక్స్ అయింది.

తమిళ సినిమా నటుడు, కమెడియన్ తంబి రామయ్య తన కుమారుడ ఉమాపతి పెళ్లి గురించి ది హిందూ పత్రికతో మాట్లాడారు. అవును నా కుమారుడు ఉమాపతి, అర్జున్ సార్ కుమార్తె ఐశ్వర్య త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు అని అన్నారు. అర్జున్ సర్జా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోలో ఉమాపతి పోటీ పడిన ర్వైవర్ రియాల్టీ షో సమయం నుంచి అర్జున్ కంట్లో పడ్డాడు.
ఆ షోలో ఉమాపతి వైఖరి చూసి అర్జున్ ఇంప్రెస్ అయ్యాడు. నేను కూడా మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాను. నా కొడుకు ఉమాపతి పెళ్లి కోసం అమ్మాయిని చూస్తున్న సమయంలో ఐశ్వర్య విషయం తెలిసిందని రామయ్య అన్నారు. మంచి అమ్మాయి కోసం చూస్తున్న సమయంలో మేము అనుకున్నదానికంటే ఇంకా మంచి అమ్మాయి మా ఇంటి కోడలుగా చిక్కడం చాలా సంతోషంగా ఉందని రామయ్య అన్నారు.
కొద్దిరోజుల క్రితం అర్జున్ సర్ కర్ణాటకలో కట్టించిన ఆంజనేయ స్వామి గుడిలో ఇరు కుటుంబాలు కలిశాయని, తర్వాత అందరూ మాట్లాడుకుని ఐశ్వర్య, ఉమాపతి పెళ్లికి అంగీకరించామని తంబి రామయ్య అన్నారు. తర్వాత మళ్లీ ఆయన ఇంట్లో కలిశాం. త్వరలో నేను, అర్జున్ సర్జా మాట్లాడుకుని పెళ్లి తేదీ ఫిక్స్ చేస్తాం. ఉమాపతి పుట్టినరోజు నవంబర్ 8వ తేదీన పెళ్లి తేదీని ప్రకటిస్తాం. వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని తంబి రామయ్య వివరించారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications