జై శ్రీరాం అనండి, లేదంటే: ముస్లీం జర్నలిస్ట్ ఫ్యామిలీకి హెచ్చరిక
ఎన్డీటీవీ జర్నలిస్ట్ మున్నే భార్తి బజరంగ్ దళ్ కార్యకర్తలపై తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ కార్యకర్తలను తనను,
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ జర్నలిస్ట్ మున్నే భార్తి బజరంగ్ దళ్ కార్యకర్తలపై తీవ్ర ఆరోపణలు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ కార్యకర్తలను తనను, తన కుటుంబాన్ని అడ్డగించి జై శ్రీరాం అనాలని, లేదంటే కారును కాల్చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు.
ఆయన చెప్పిన వివరాల మేరకు.. బీహార్‌లోని వైశాలి నుంచి కుటుంబంతో పాటు ఆయన సమస్తిపూర్ వెళ్తున్నారు. ఆయనతో పాటు భార్య, తల్లి, తండ్రి తదితరులు ఉన్నారు. మధ్యలో నలుగురైదుగురు కార్యకర్తలు తమను అడ్డగించారని చెప్పారు.

తన తండ్రికి ఉన్న గెడ్డం, తన భార్య బురఖాను చూసి వారు కారును ఆపారని, కర్రలు పట్టుకొని ఉన్నారని ఆయన చెప్పారు. జైశ్రీరాం అనాలని లేదంటే కారును కాల్చి వేస్తామని బెదిరించారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ను కూడా సీఎం నితీష్‌కు ట్యాగ్ చేశారు.












Click it and Unblock the Notifications