‘ఆప్’కు నా మద్దతు లేదు: ఈసికి తెలిపిన అమీర్‌ఖాన్
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు మిగితా ఏ ఇతర పార్టీలకి తాను మద్దతు పలకడం లేదని, సమర్థించడం లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు 'ధూమ్' హీరో అమీర్ ఖాన్ తమ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ఫొటోతో ట్విట్టర్లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అమీర్ ఈసికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. తాను ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు తెలపడం లేదని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో అమీర్ పేర్కొన్నారు.

తాను ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు అమీర్ తెలిపారు. అందుకే తాను కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారని, తన లేఖలో ఏ పార్టీకి తన మద్దతు తెలియజేయడం లేదని అమీర్ పేర్కొన్నట్లు ఆయన వ్యక్తిగత అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
‘నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం లేదు. ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీని సమర్థించడం లేదు. ఏ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించడం లేదు' అని అమీర్ ఖాన్ తన లేఖలో పేర్కొన్నట్లు అమీర్ వ్యక్తిగత అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే అమీర్ ఖాన్ ఎన్నికల సంఘం తరపున ఓటింగ్‌పై ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
-
66 ఏళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుందా ??? -
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. ఇక ఊరుకోను: రష్మిక సంచలన పోస్టు.. -
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications