అన్న చనిపోయిన రోజే రెబల్ స్టార్ మృతి, సత్యం ఎంతో ! ఒక్కటయ్యారు: ఇద్దరూ అనారోగ్యంతో!

బెంగళూరు: పలువురు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు చావులో ఒక్కటి అవుతుంటారు. అందులో సత్యం ఎంతో ఆదేవుడికే తెలియాలి. స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ విషయంలో అదే జరిగింది. సొంత సోదరుడు చనిపోయిన రోజే రెబల్ స్టార్ అంబరీష్ ప్రాణాలు వదిలారు.

1948లో రెబల్ స్టార్ అంబరీష్ సోదరుడు హరీష్ (69) జన్మించారు. వృత్తిపరంగా వైద్యుడు అయిన డాక్టర్ హరీష్ కేఎం. దొడ్డి ప్రాంతంలో సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. 35 ఏళ్లలుగా వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ హరీష్ కు తమ్ముడు అంబరీష్ అంటే ఎంతో ప్రేమ, అభిమానం.

Actor Ambarish demised on the same he lost his elder brother Dr. Harish.

వీలైనప్పుడు డాక్టర్ హరీష్ సొదరుడు అంబరీష్ ఇంటికి చేరుకుని ఆయనతో ముచ్చటించేవారు. 2017 నబంబర్ 24వ తేదీన అనారోగ్యంతో డాక్టర్ హరీష్ మైసూరులో మరణించారు. 2018 నవంబర్ 24 తేదీన రెబల్ స్టార్ అంబరీష్ సైతం అనారోగ్యంతో మరణించారు. సొదరులు ఇద్దరూ నవంబర్ 24వ తేదీనే కళ్లుమూశారు.

కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న రెబల్ స్టార్ అంబరీష్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. శనివారం రాత్రి ఇంటిలో ఉన్న అంబరీష్ తనకు అనారోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పడం వారు వెంటనే ఆయన్ను విక్రమ్ ఆసుపత్రికి తరలించడం, అప్పటికే ఆయన మరణించడం జరిగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+