నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు: తమిళ విలన్ ఆనంద్ రాజ్
కొంతమంది వ్యక్తులు చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కావాలని ఆనంద్ రాజ్ పోలీసులతో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
చెన్నై: ప్రముఖ తమిళ ప్రతినాయకుడు, అన్నాడీఎంకె మాజీ నేత ఆనందర్ రాజ్ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ పోలీసులను ఆశ్రయించారు. చెన్నైలోని నుంగంబాకం పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఆయన ఫిర్యాదు చేశారు.

కొంతమంది వ్యక్తులు తనను ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆనంద్ రాజ్ పేర్కొన్నారు. చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కావాలని ఆనంద్ రాజ్ పోలీసులతో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆనంద్ రాజ్ ఇంటివద్ద భద్రత పెంచిన పోలీసులు..ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, అన్నాడీఎంకెలో శశికళ నాయకత్వం పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్న ఆనంద్ రాజ్ ఇటీవలే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీలో పరిస్థితులు బాగా లేనందువల్లే తాను తప్పుకోవాల్సి వచ్చిందని ఆ సందర్బంగా ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications