మరదలికి సినిమా ఛాన్స్ ఇవ్వలేదని హీరోపై దాడి, జుట్టు కత్తిరించారు..!

బెంగుళూరు: బంధువుల అమ్మాయికి తాను కొత్తగా తీయబోయే సినిమాలో నటించే అవకాశం ఇవ్వలేదన్న కోపంతో, హీరోపై దాడి చేసి గుండు గీశారని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఆడిషన్స్ తీసుకోవడానికి అర్జున్ అనే యువ హీరో కర్ణాటకలోని బళ్లారికి వచ్చారు. ఆ సమయంలో రోష్ని అనే యువతి అతని వద్దకు వచ్చి తనకు హీరోయిన్ అవకాశం ఇవ్వాలని కోరింది. ఆమెకు నటనలో అనుభవం లేక పోవడం చేత ఆయన తిరస్కరించారు.

Actor assaulted for refusing role to girl

జరిగిన విషయం తెలుసుకున్న రోష్ని బావ అమిత్ మరో 15 నుంచి 20 మందిని వెంటేసుకొచ్చి అర్జున్ ఆఫీసుకు వచ్చి, ఆయన్ని ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ఇంటికి తీసుకెళ్లి ఆయనపై దాడి చేసి జట్టు కత్తించారని తన ఫిర్యాదులో అర్జున్ పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.

తనతో పాటు భార్య పూజ, మరో నటుడిపై కూడా రోష్ని బావ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితునిపై ప్రేమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. అతడిని అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు అదనపు ఎస్పీ రాజీవ్ మల్హోత్రా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+