వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నమ్మకు ఝలక్ ఇచ్చిన రాఘవ లారెన్స్: ఆ దమ్ము ఒక్కరికే ఉంది

తమిళనాడులో జరుగుతున్న పరిణామాలను తాను క్షుణ్ణంగా గమనిస్తున్నానని, అన్నీ ఆలోచించిన తరువాత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించానని లారెన్స్ మీడియాకు చెప్పారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు పోరాటంలో యువతకు అండగా ఉంటూ కీలకంగా వ్యవహరించి తాను రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించి యూత్ లో నిజమైన రియల్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు, నిర్మాత, దర్శకుడు రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

జయలలిత ఆక్రమాస్తుల కేసు తీర్పు నేడే: శశికళ జైలుకా ? సీఎం కుర్చీకా ?జయలలిత ఆక్రమాస్తుల కేసు తీర్పు నేడే: శశికళ జైలుకా ? సీఎం కుర్చీకా ?

చెన్నైలోని గ్రీన్ వేస్ రోడ్డులోని అపద్దరమ్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటికి సోమవారం రాత్రి రాఘవ లారెన్స్ వెళ్లారు. పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలు రాఘవ లారెన్స్ కు ఆత్మీయ అలింగనాలతో స్వాగతం పలికారు.

Actor and choreographer Raghava Lawrence extends support to O Panneerselvam.

తరువాత తన సంపూర్ణ మద్దతు మీకే ఉంటుందని రాఘవ లారెన్స్ పన్నీర్ సెల్వంకు చెప్పారు. అనంతరం ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాను క్షుణ్ణంగా గమనిస్తున్నానని, అన్నీ ఆలోచించిన తరువాత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించానని లారెన్స్ మీడియాకు చెప్పారు.

జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్

అమ్మ జయలలిత ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే సత్తా ఒక్క పన్నీర్ సెల్వంకు మాత్రమే ఉందని లారెన్స్ అన్నారు. లారెన్స్ కంటే తమిళ సినీరంగానికి చెందిన అనేక మంది సీనియర్ నాయకులు అంతకు ముందే పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో తీర్పు వెలువడుతున్న సమయంలో యువతలో మంచి క్రేజ్ ఉన్న లారెన్స్ పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చి శశికళకు ఝలక్ ఇచ్చారు. లారెన్స్ తనకు మద్దతు ఇవ్వడంతో తమిళనాడులోని యువత మొత్తం నా వెంట ఉన్నట్లు అయ్యిందని పన్నీర్ సెల్వం మీడియాకు చెప్పారు.

English summary
Actor and choreographer Raghava Lawrence extends support to Tamil Nadu CM O Panneerselvam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X