నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో నా పేరు చెప్పకూడదు: రూ. 50 లక్షలు ఇచ్చి టాప్ హీరో !

ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన పన్సర్ సునీ తన పేరు బయట పెడుతాడని మాలీవుడ్ హీరో దిలీప్ ముందుగానే పసిగట్టాడని కేరళ పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన పన్సర్ సునీ తన పేరు బయట పెడుతాడని మాలీవుడ్ హీరో దిలీప్ ముందుగానే పసిగట్టాడని కేరళ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఎలాంటి పరిస్థితుల్లో తన పేరు చెప్పకుండా ఉండటానికి దిలీప్ భారీ మొత్తంలో నిందితుడికి నగదు ఇచ్చాడని వెలుగు చూసింది.

కొచ్చిలోని కేరళ పోలీసు క్లబ్ లో దిలీప్, దర్శకుడు, నిర్మాత నాదిర్ షా ను 13 గంటల పాటు విచారించిన పోలీసులు చివరికి ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు పంపించారు. దిలీప్ ను అరెస్టు చేసే ముందు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న 19 సాక్షాలు సేకరించారు.

Actor Dileep paid Rs 50 lakhs Pulsar Sunil

నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో గతంలో అరెస్టు అయిన ప్రముఖ నిందితుడు పల్సర్ సునీ తన పేరు చెప్పకుండా ఉండటానికి దిలీప్ రూ. 50 లక్షలు ఇచ్చాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఎట్టి పరిస్థితుల్లో తన పేరు చెప్పకూడదని, నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తానని దిలీప్ పల్సర్ సునీకి హామీ ఇచ్చాడని పోలీసులు అంటున్నారు.

పల్సర్ సునీ స్నేహితుడు రూ. 1.50 కోట్లు ఇవ్వాలని దిలీప్ ను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులు సాక్షాలు సేకరించారు. చివరికి జైల్లో ఉన్న పల్సర్ సునీల్ తన సెల్ లోని సాటి ఖైదీ దగ్గర నటి కిడ్నాప్, లైంగిక దాడి చెయ్యడానికి హీరో దిలీప్ స్కెచ్ వేశాడని చెప్పడం, ఆ ఖైదీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొదటికే మోసం వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+