రాజకీయాల్లో కమల్ హాసన్ హాస్యనటుడిగా మిగిలిపోతారు, సీఎం మాత్రం కాలేరు, మంత్రి!
చెన్నై: బహుబాష నటుడు, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ మీద తమిళనాడు మంత్రులు మళ్లీ మాటలతూటాలు పేల్చుతున్నారు. రాజకీయాల్లో కమల్ హాసన్ సీఎం కాలేరని, కేవలం హాస్య (కామిడీ) నటుడిగానే మిగిలిపోతారని ఎద్దేవ చేస్తున్నారు.

సినిమా కాదు
తమిళనాడు మంత్రి సెల్లూరు రాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ తాను కచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోతానని కమల్ హాసన్ కలలు కంటున్నారని ఎద్దేవ చేశారు. రాజకీయాలు అంటే సినిమాల్లో నటించినంత సులభం కాదని సెల్లూరు రాజు చెప్పారు.

ప్రజలు ఓకే చెప్పాలి
రాజకీయాల్లో పైకి రావాలంటే మొదట మనల్ని ప్రజలు ఆధరించాలని మంత్రి సెల్లూరు రాజు అన్నారు. ఎన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేసిన వాళ్లే ముఖ్యమంత్రులు అయ్యారని, పార్టీ పెట్టిన వెంటనే కమల్ హాసన్ సీఎం అయిపోవాలని కలలు కంటున్నారని మంత్రి సెల్లూరు రాజు ఎద్దేవ చేశారు.

హీరోల పగటి కలలు
సినీరంగం నుంచి తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన చాల మంది నటులు పగటికలలు కన్నారని, ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారో ప్రజలకే తెలియడం లేదని మంత్రి సెల్లూరు రాజు అన్నారు. మొదట ప్రజాసేవ చేసి ప్రజలకు దగ్గర కావాలని కమల్ హాసన్ కు మంత్రి సెల్లూరు రాజు సూచించారు.

అభిమానుల ఆగ్రహం
మంత్రి సెల్లూరు రాజు వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ లో మంత్రి సెల్లూరు రాజుకు ఒక్క శాతం క్రేజ్, పలుకుబడి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకోసారి మా నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తే తగిన బుధ్దిచెబుతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications