కమల్ హాసన్ అనే నేను.. రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం !
భారతీయ సినీ పరిశ్రమలో ఆల్ టైమ్ బెస్ట్ యాక్టర్స్‌లో ఒకరుగా గుర్తింపు పొందారు లోక నాయకుడు " కమల్ హాసన్ ". బాలనటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించి మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత నటుడిగా మరో మూడు సార్లు నేషనల్ అవార్డును గెలుచుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, పాటల రచయిత, నృత్య దర్శకుడిగా, మేకప్ ఆర్టిస్ట్ గా కూడా టాలెంట్ నిరూపించుకున్నారు. తమిళంలో స్టార్ హీరో అయినప్పటికీ ఆయనకు తెలుగు, హిందీ సహా పలు భాషల్లో సైతం ఫుల్ క్రేజ్ ఉంది.
పొలిటికల్ ఎంట్రీ..
అటు సినిమాలతో పాటే రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు కమల్. 2018లో 'మక్కల్ నీది మయ్యం' (MNM) పార్టీని స్థాపించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి మద్దతు ప్రకటించి.. వారి విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. రీసెంట్ గానే కమల్ హాసన్ డీఎంకే కూటమి మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎంపీగా ప్రమాణస్వీకారం..
ఈ మేరకు ఈరోజు ( జూలై 25, 2025 ) పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే తమిళంలో ప్రమాణస్వీకారం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో పాటు డీఎంకే నుంచి పి. విల్సన్, సల్మా, ఎస్.ఆర్. శివలింగం కూడా ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో రాణిస్తున్నారని శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు కమల్ హాసన్ కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్ కూడా సినీ పరిశ్రమలో హీరోయిన్లుగా మంచి గుర్తింపు పొందారు. శ్రుతి హాసన్ ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా అలరిస్తుంది. అక్షర కూడా విభిన్న పాత్రలతో ఆడియన్స్ కి చేరువ అవుతోంది.
ఇక రీసెంట్ గానే కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "థగ్ లైఫ్". గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌లో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 5, 2025న విడుదల అయ్యింది. ఈ చిత్రంలో స్టార్ హీరో శింబు కూడా నటించగా అభిరామి, త్రిష హీరోయిన్స్ గా నటించారు. అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
-
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications