వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో కమల్ హాసన్ రివర్స్ గేర్: బీజేపీతో పొత్తుకు సై, రెండు రోజుల్లో యూటర్న్, నెటిజన్ల సెటైర్లు !

రాజకీయ పార్టీ స్థాపిస్తానని, తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, రాష్ట్ర ప్రజలు తనను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని ఇటీవల వరకు సంచలన వ్యాఖ్యలు చేసిన బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్.

|
Google Oneindia TeluguNews

చెన్నై: రాజకీయ పార్టీ స్థాపిస్తానని, తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, రాష్ట్ర ప్రజలు తనను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని ఇటీవల వరకు సంచలన వ్యాఖ్యలు చేసిన బహుబాష నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ ఇప్పుడు మాట మార్చారు.

హీరో కమల్ హాసన్ కు అదే గతి పడుతుంది: సీఎం పదవి మార్కెట్ లో చిక్కదు: మంత్రి కౌంటర్ !హీరో కమల్ హాసన్ కు అదే గతి పడుతుంది: సీఎం పదవి మార్కెట్ లో చిక్కదు: మంత్రి కౌంటర్ !

జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తాను బీజేపీకి శత్రువు కాదని కమల్ హాసన్ వివరణ ఇచ్చారు. తమిళనాడు ప్రజల కష్టాలు తీర్చడానికి అవసరం అయితే బీజేపీతో కలిసి పని చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇద్దరు సీఎంలతో !

ఇద్దరు సీఎంలతో !

ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్ తో కలిసిన సమయంలో తాను కాషాయ రంగు వ్యక్తిని కాదని, ఆ పార్టీలో చేరనని మీడియాకు చెప్పారు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెన్నై చేరకుని స్వయంగా కమల్ హాసన్ తో భేటీ అయ్యారు.

బీజేపీకి వ్యతిరేకంగా కమల్ !

బీజేపీకి వ్యతిరేకంగా కమల్ !

దేశంలో అవినీతిపై, మతోన్మాద పార్టీలకు వ్యతిరేకంగా తాను అరవింద్ కేజ్రీవాల్ తో కలిసిపోరాటం చేస్తానని కమల్ హాసన్ మీడియాకు చెప్పారు. రెండు రోజుల క్రితం తన సిద్దంతాలకు బీజేపీ సిద్దాంతాలకు చాల వ్యత్యాసం ఉందని, రజనీకాంత్ కు బీజేపీ సిద్దాంతాలకు దగ్గర పోలిక ఉందని కమల్ హాసన్ చెప్పారు.

రజనీకాంత్ కరెక్ట్

రజనీకాంత్ కరెక్ట్

రజనీకాంత్ కావాలంటే బీజేపీలో చేరే వకాశం ఉందని, తాను మాత్రం ఆ పార్టీలో చేరనని రెండు రోజుల క్రితం చెప్పిన కమల్ హాసన్ ఇప్పుడు వెంటనే మాట మార్చారు. కమల్ హాసన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

కొత్త పార్టీ, గుర్తు కోసం !

కొత్త పార్టీ, గుర్తు కోసం !

కొత్త పార్టీ గురించి మాట్లాడిన కమల్ హాసన్ తాను పార్టీ పేరు, జెండా, చిహ్నం తదితర అంశాలపై నిపుణులతో చర్చిస్తున్నానని, త్వరలోనే ఓ మంచి నిర్ణయం తీసుకుంటానని కమల్ హాసన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో వివరించారు.

పోలిటీషియన్లకు తీసిపోరు !

పోలిటీషియన్లకు తీసిపోరు !

రాజకీయాల్లోకి రాకముందే కమల్ హాసన్ ద్వందవైఖరితో మాట్లాడుతున్నారని, ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆయన మాటలు ఎలా ఉంటాయో అని తమిళనాడు ప్రజలు అప్పుడే చర్చించుకుంటున్నారు. మొత్తం మీద కమల్ హాసన్ నాలుగు రోజుల్లోనే బీజేపీ విషయంలో మాటమార్చి ఇప్పుడు మీడియాలో హాట్ టాఫిక్ అయ్యారు.

English summary
Actor Kamal Hassan says that If TN needs i can even make alliance with BJP for governance purpose only. There should not be untouchability in Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X