Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Actor: ఫ్రెండ్ తల నరికి ఎత్తుకెళ్లిన నటుడు, స్క్రీన్ మీద విలన్, నిజ జీవితంలో ?, అదే డౌట్, క్లైమాక్స్ లో !

బెంగళూరు/చిత్రదుర్గా: సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తున్న వ్యక్తి, వ్యాపారం చేస్తున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి స్నేహితులు. ఇద్దరూ వివాహం చేసుకుని వాళ్ల భార్య, పిల్లలతో జీవిస్తున్నారు. ఒకరు నటుడు అయినా, మరోకరు వ్యాపారం చేస్తున్నా ప్రతినిత్యం కలుస్తూ సంతోషంగా మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరి సొంత ఊరు ఒక్కటే కావడంతో ఉగాది పండుగ జరుపుకోవడానికి సిటీ నుంచి రెండు ఫ్యామిలీలు సొంత ఊరికి వెళ్లారు. ఉగాది పండుగ నుంచి ఇద్దరు స్నేహితులు వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు నటుడు, అతని స్నేహితుడు మందు పార్టీ చేసుకున్నారు.

రాత్రి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి భోజనం చేసి నిద్రపోయారు. రాత్రి వేడి ఎక్కువగా ఉండటంతో వ్యాపారి ఇంటి తలుపు తీసి నిద్రపోయాడు. ఇంటి బయట వ్యాపారి తండ్రి కూడా నిద్రపోయాడు. అర్దరాత్రి 1 గంట సమయంలో సినిమా నటుడు స్నేహితుడి ఇంటిలోకి వెళ్లాడు. నిద్రపోతున్న స్నేహితుడి తలను వేట కొడవలితో నరికేసిన నటుడు అతని తలను సంచిలో వేసుకుని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తరువాత తన పొలంలో స్నేహితుడి తలను పాతిపెట్టిన నటుడు సైలెంట్ గా అతని ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. సినిమా నటుడు అతని స్నేహితుడి తల నరికి హత్య చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ఫ్రెండ్ ను సినిమా నటుడు ఎందుకు హత్య చేశాడు ? అని అసలు మ్యాటర్ తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 మంచి స్నేహితులు

మంచి స్నేహితులు

కర్ణాటకలోని చిత్రదుర్గా జిల్లాలోని హిరియూరు తాలుకాలోని శ్రావణగెరె ప్రాంతంలో శ్రీనివాస్ అలియాస్ రౌడీ శీన అలియాస్ రౌడీ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇదే ఊరిలో ఉంటున్న రమేష్ (45) అనే వ్యక్తి నటుడు శ్రీనివాస్ చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు. ఒకేఊరిలో ఉంటున్న శ్రీనివాస్, రమేష్ మంచి స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

 సినిమాల్లో నటిస్తున్నాడు.... ఒకరు వ్యాపారి

సినిమాల్లో నటిస్తున్నాడు.... ఒకరు వ్యాపారి

శ్రీనివాస్ అలియాస్ రౌడీ శీన కన్నడలో తెరకెక్కిన ఫైల్వాన్, వంశీ, సంతె, నంద-నందిత తదితర స్యాండిల్ వుడ్ సినిమాలలో విలన్ కు అసిస్టెంట్ గా రౌడీ పాత్రాల్లో నటించాడు. శ్రీనివాస్ కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడ సహాయ నటుడు రౌడీ శీన స్నేహితుడు బెంగళూరులో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు.

 బెంగళూరులో ఇద్దరూ కాపురం

బెంగళూరులో ఇద్దరూ కాపురం

సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటిస్తున్న రౌడీ శీన, వ్యాపారం చేస్తున్న రమేష్ కొన్ని సంవత్సరాల నుంచి స్నేహితులు మాత్రమే కాకుండా బెంగళూరులో ఒకే ఏరియాలో పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. నటుడు రౌడీ శీన, రమేష్ ఇద్దరూ వివాహం చేసుకుని వాళ్ల భార్య, పిల్లలతో జీవిస్తున్నారు. ఒకరు నటుడు అయినా, మరోకరు వ్యాపారం చేస్తున్నా ప్రతినిత్యం కలుస్తూ సంతోషంగా మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

 ఉగాది పండుగ కోసం సొంత ఊరు వెళ్లారు

ఉగాది పండుగ కోసం సొంత ఊరు వెళ్లారు

రౌడీ శీన, రమేష్ ల సొంత ఊరు ఒక్కటే కావడంతో ఉగాది పండుగ జరుపుకోవడానికి బెంగళూరు సిటీ నుంచి రెండు ఫ్యామిలీలు సొంత ఊరు శ్రావణగెరెకి వెళ్లారు. ఉగాది పండుగ నుంచి ఇద్దరు స్నేహితులు రౌడీ శీన, రమేష్ వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ ఎంజాయ్ చేశారు.

 సాయంత్రం వరకు లిక్కర్ పార్టీ

సాయంత్రం వరకు లిక్కర్ పార్టీ

సాయంత్రం నుంచి రాత్రి వరకు నటుడు రౌడీ శీన, అతని స్నేహితుడు రమేష్ ఊరి బయట పొలంలో లిక్కర్ పార్టీ చేసుకున్నారు. రాత్రి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి భోజనం చేసి నిద్రపోయారు. రాత్రి వేడి ఎక్కువగా ఉండటంతో వ్యాపారి రమేష్ అతని ఇంటి తలుపు తీసి నిద్రపోయాడు. ఇంటి బయట వ్యాపారి రమేష్ తండ్రి కూడా నిద్రపోయాడు.

 అర్దరాత్రి ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన కన్నడ నటుడు

అర్దరాత్రి ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన కన్నడ నటుడు

అర్దరాత్రి 1 గంట సమయంలో సినిమా నటుడు రౌడీ శీన అతని స్నేహితుడు రమేష్ ఇంటిలోకి వెళ్లాడు. నిద్రపోతున్న స్నేహితుడు రమేష్ తలను వేట కొడవలితో నరికేసిన నటుడు రౌడీ శీన ఫ్రెండ్ రమేష్ తలను సంచిలో వేసుకుని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తరువాత పొలంలో స్నేహితుడు రమేష్ తలను పాతిపెట్టిన నటుడు రౌడీ శీన సైలెంట్ గా అతని ఇంటికి వెళ్లి నిద్రపోయాడు.

 హడలిపోయిన కుటుంబ సభ్యులు

హడలిపోయిన కుటుంబ సభ్యులు

బయట నిద్రపోతున్న తండ్రి ఇంటి లోపికి వెళ్లి చూడా ఆయన కొడుకు రమేష్ తల లేకుండా మొండం మాత్రం ఉండి హత్యకు గురైన విషయం తెలుసుకుని గట్టిగా కేకలు వేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. సినిమా నటుడు రౌడీ శీన అతని స్నేహితుడు రమేష్ తల నరికి హత్య చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. రమేష్ ను సినిమా నటుడు రౌడీ శీన ఎందుకు హత్య చేశాడు ? అని అసలు మ్యాటర్ తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 చేతబడి చేశారని నటుడికి అనుమానం

చేతబడి చేశారని నటుడికి అనుమానం

తనకు ఎవరో చేతబడి చేశారని, అందుకే నా కాపురం నాశనం అవుతోందని నటుడు రౌడీ శీన చాలా కాలం నుంచి అనుమానం పెంచుకున్నాడని, కొంతకాలంగా రమేష్, రౌడీ శీనల మద్య గొడవలు జరిగి తరువాత ఒక్కటి అయిపోయారని, ఇదే విషయంలో నటుడు రౌడీ శీన అతని ఫ్రెండ్ రమేష్ మీద కక్ష పెంచుకుని అతని తల నరికి చంపేశాడని డీఎస్పీ రోషన్ జమీర్ మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+