నెటిజన్లకు అలా బుక్ అయిన మోహన్ లాల్
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని నటుడు మోహన్ లాల్ సమర్థించడం పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో మద్దతు, విమర్శలు కనిపిస్తున్నాయి.
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని నటుడు మోహన్ లాల్ సమర్థించడం పైన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో మద్దతు, విమర్శలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది ఆయనను సమర్థిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది ఆయన పైన విమర్శలు చేస్తున్నారు.
ఆయన పోస్ట్ పెట్టిన సమయంలోనే కేరళలో డబ్బులు మార్పిడి చేసుకునేందుకు క్యూలో నిలబడిన ఇద్దరు మృతి చెందారు. దీంతో మోహన్ లాల్ నెటిజన్లకు బుక్ అయ్యారు. ఆయన పైన కొందరు విమర్శలు చేశారు.
అదే సమయంలో బ్యాంక్ క్యూలకు, లిక్కర్ స్టోర్ క్యూలకు పొంతన పెట్టడాన్ని కూడా కొందరు వ్యతిరేకించారు. మరోవైపు, ఎక్కువ మంది ఆయనను సమర్థించారు. ఆయనకు తన అభిప్రాయం చెప్పుకునే స్వేచ్ఛ ఉందని ట్వీట్ల వర్షం కురిపించారు.

రెండు రోజుల క్రితం మోహన్‌లాల్ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. నల్లధనం నిర్మూలనకు ప్రధాని మోడీ పెద్దనోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని అభిప్రాయపడ్డారు.
'పెద్ద నోట్లు రద్దు అనే నిర్ణయాన్ని నేను సర్జికల్ స్ట్రైక్‌లానే భావిస్తున్నాను. నేను నేతల్ని పూజించను. కానీ ఆ నేతలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తాను. ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే' అని మోహన్ లాల్ చెప్పుకొచ్చారు.
అంతేగాక, 'పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా మున్ముందు మంచి జరుగుతుందని నాకు అర్థమైంది. ఇలాంటి ఓ పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాని ప్రభావం కనిపించకుండా పోదు. డబ్బు కోసం గంటల తరబడి బ్యాంకు ఎదుట బారులు తీరుతున్న ప్రజల బాధను నేను అర్థంచేసుకోగలను' అని అన్నారు.
'మద్యం దుకాణాలు, సినిమా థియేటర్లు, గుళ్లుగోపురాల ఎదుట కూడా గంటలు తరబడి నిలబడుతుంటాం. అలాగే మున్ముందు జరగబోయే మంచి కోసం కొద్ది గంటల పాటు నిలబడినా నష్టం లేదని నా అభిప్రాయం' అని మోహన్‌లాల్ తన బ్లాగులో పేర్కొన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications