లైంగిక దాడి చేయాలని వచ్చాడని సినీ నటి ఆరోపణ: ఆమె తాగి ఉందని ప్రత్యారోపణ
భోపాల్: హోటల్లో తనను పురుష ఉద్యోగి వేధించాడని షూటింగ్ నిమిత్తం భోపాల్ వచ్చిన ఓ సినీ నటి ఆరోపించింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోటల్ బాయ్ తన గదిలోకి గురువారం రాత్రి ప్రవేశించాడని, తనపై లైంగిక దాడి చేసే ఉద్దేశంతోనే అలా ప్రవేశించాడని ఆమె ఫిర్యాదు చేసింది.
సినీ నటి చేసిన ఫిర్యాదు మేరకు ఎంపి నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించినందుకు, రాత్రి పూట లోనికి చొరబడినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మైనర్ బాలుడు. అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

సినీ నటి తాగి ఉందని, గది తలుపులు పెట్టుకోవాలని మాత్రమే విజ్ఞప్తి చేశామని బాయ్‌తో పాటు హోటల్ మేనేజర్ కూడా చెబుతున్నారు. వివాదం అర్థరాత్రి దాటే వరకు కొనసాగింది.
సత్తా పరివర్తన్ అనే హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం ఆ నటి భోపాల్‌లో ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఉంటోంది. సినీ నటి పబ్లిక్ స్టంట్‌లో భాగంగానే ఇదంతా చేసిందని హోటల్ యాజమాన్యం అంటోంది. హోటల్ ఉద్యోగితో సాయంత్రం మాట్లాడుతున్న చిత్రాలు సిసిటీవీలో రికార్డు అయ్యాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications