బీజేపీ ఎంపీ మీద పరువునష్టం దావా వేసిన నటుడు ప్రకాష్ రాజ్, రూ. ఎంతకో తెలుసా ?
మైసూరు/బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు-కొడుగు పార్లమెంట్ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మీద ప్రముఖ బహుబాష నటుడు, దర్శక నిర్మాత ప్రకాష్ రాజ్ మంగళవారం పరువు నష్టం దావా వేశారు. తన పరువు తీసే విధంగా సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ తనను విమర్శించారని, లేనిపోని ఆరోపణలు చేశరాని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ మంగళవారం మైసూరు కోర్టును ఆశ్రయించారు.

సోషల్ మీడియాలో వైరల్
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా, నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగించారు. ఆ సందర్బంలో వీరి ఆరోపణలు, ప్రత్యారోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు ప్రకాష్ రాజ్ ను విమర్శిస్తే మరి కొందరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను విమర్శించారు.

ప్రధాని మోడీకి ప్రశ్నలు
నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు చేశారు. ప్రకాష్ రాజ్ మోడీని ప్రశ్నించడంతో బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎంటర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ప్రకాష్ రాజ్ ను తీవ్రస్థాయిలో విమర్శించారు.

కొడుకు చస్తే డ్యాన్సర్ తో ఎంజాయ్
కొడుకు చనిపోయాడని ఏమాత్రం బాధలేకుండా ప్రకాష్ రాజ్ ఓ డ్యాన్సర్ తో పారిపోయి చిందులు వేశాడని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆరోపించారు. ఇలాంటి మానవత్వం లేని వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఎలా ప్రశ్నిస్తారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సోషల్ మీడియాలో మండిపడ్డారు.

నిజ జీవితంలో విలన్
సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ప్రకాష్ రాజ్ విలన్ అని బీజేపీ ఎంపీ సోషల్ మీడియాలో ఆరోపించారు. ఫేస్ బుక్, ట్వీట్టర్ వేదికగా తనను అవమానించి, తన పరువుకు భంగంకలిగేలా ప్రవర్తించిన బీజేపీ ఎంపీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించిన ప్రకాష్ రాజ్ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు.

పరువు నష్టం ఎంతకంటే ?
బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా తనను వ్యక్తిగతంగా విమర్శించి తన పరువుకు భంగం కలిగేలా చేశారని, న్యాయం చెయ్యాలని ప్రకాష్ రాజ్ మైసూరు కోర్టును ఆశ్రయించారు. తన పరువుపోవడానికి కారణం అయిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నుంచి రూ. 1 పరిహారం ఇప్పించాలని ప్రకాష్ రాజ్ కోర్టులో మనవి చేశారు.

ఒక్క రూపాయితో పరువు
తాను డబ్బుకోసం పరువు నష్టం దావా వెయ్యలేదని, ఉన్నతమైన ఎంపీ స్థానంలో ఉన్న ప్రతాప్ సింహా ఆయన స్థాయి మరిచిపోయి దిగజారుడు రాజకీయాలు చేశారని, అందుకే తగిన బుద్ది చెప్పడానికి పరువు నష్టం దావా వేశానని ప్రకాష్ రాజ్ చెప్పారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications